శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (13:52 IST)

ఎస్.. నేను స్త్రీలోలుడినే : సూట్స్ టీవీ షోలో షేన్ వార్న్ ఒప్పుకోలు!

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఎట్టకేలకు తన ప్రేమాయణంపై సాగిన ప్రచారమంతా నిజమని అంగీకరించారు. తాను నిజంగానే స్త్రీలోలుడునేనంటూ ఓ టీవీ షోలో వెల్లడించాడు. ముఖ్యంగా భార్యతో విడిపోయినప్పటి నుంచి అనేక మంది మహిళలతో అఫైర్లు సాగించినట్టు చెప్పాడు. అందువల్ల తాను స్త్రీలోలుడినేనని అంగీకరించాడు. తనని తాను 'సూట్స్' అనే టీవీ షోలోని క్యారెక్టర్ 'హార్వే స్పెక్టర్' లాంటి వాడినని అభివర్ణించుకున్నాడు. ఈ మేరకు వార్న్ ట్వీట్ చేశాడు. 
 
కాగా, ఆస్ట్రేలియాకు సుదీర్ఘకాలం సేవలందించిన వార్న్ కెరీర్ మొత్తమ్మీద 708 టెస్టు వికెట్లు, 293 వన్డే వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2006లో ఆటకు రిటైర్మెంటు ప్రకటించిన తర్వాత, వ్యాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇక, వైవాహిక జీవితం విషయానికొస్తే, సిమోన్ కల్లహాన్‌ను పెళ్ళాడి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చాడు. 2005లోనే వీరు విడిపోయారు. 
 
వార్న్ కాపురంలో చిచ్చుకు ప్రముఖ మోడల్, బ్రిటీష్ నటి ఎలిజబెత్ హర్లీనే కారణమని బ్రిటన్ టాబ్లాయిడ్లు కోడై కూశాయి. హర్లీనే కాకుండా, మరికొందరితోనూ వార్న్ ప్రేమాయణాలు సాగించినట్టు ఎన్నో వార్తలొచ్చాయి. తాజాగా, ఈ మాజీ క్రికెటర్ మళ్ళీ సిమోన్ కల్లహాన్‌తో జీవించాలని భావిస్తున్నట్టు కథనాలు రాగా, వాటిని వార్న్ కొట్టిపారేశాడు.