శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (18:44 IST)

ఇంగ్లండ్‌పై గెలుపు: ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా

ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా ప్రవేశించింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 304 పరుగులు టార్గెట్‌ను ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. 
 
కాగా 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు ఇది వరుసగా మూడవ విజయం కావడంతో ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్‌ హ్యాట్రిక్‌ సాధించినట్లయింది.
 
ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌ (102) సెంచరీతో అదరగొట్టాడు. 93 బంతులలో 6 బౌండరీలు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా వన్డేల్లో మూడవ సెంచరీని నమోదు చేసుకున్నాడు. చివరలో వరుసగా వికెట్లు పడటంతో ఉత్కంఠ రేగింది.
 
అయినప్పటికీ విజయం కంగారూలనే వరించింది. పించ్‌ 32 పరుగులు, మార్ష్‌ 45 పరుగులు, మ్యాక్స్‌వెల్‌ 37 పరుగులు, పాల్కనర్‌ 35 పరుగులు, హాడిన్‌ 47 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌, అలీ, పిన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.
 
కాగా వరుస విజయాలతో ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరింది. మరో ఫైనల్‌ బెర్తు కోసం ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య పోటీ నెలకొంది. టోర్నీలో భారత్‌ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు.
 
ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మిత్‌ అరంగేట్రం టెస్ట్‌, వన్డే మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.