శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2014 (12:46 IST)

శ్రీనివాసన్‌కు సుప్రీంలో ఊరట: ఐసీసీ పదవి ఖాయమేనా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సభ్య సమావేశంలో పాల్గొనకుండా ఎన్. శ్రీనివాసన్‌ను అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌ 30న జరగాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఎన్. శ్రీనివాసన్ కోసమే నవంబర్ 20కి వాయిదా వేశారని, ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ బీహార్‌ క్రికెట్‌ సంఘం తరఫు న్యాయవాది చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఐతే ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై విచారణ చేస్తున్న జస్టిస్ ముద్గల్ కమిటీ నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. వచ్చే నెల 10న మాకు ముద్గల్ కమిటీ నివేదిక అందుతుంది. 
 
ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సందేనని, ఒక వేళ నివేదికలో శ్రీనివాసన్‌ నిర్దోషి అని తేలితే పరిస్దితి ఏంటీ? ప్రస్తుతం మాకు వార్షిక సర్వసభ్య సమావేశంపై ఎలాంటి ఆందోళన లేదు" అని జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఫక్రి మహ్మద్‌ ఇబ్రహీంతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
 
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ఈ కమిటీ విచారణ జరుపుతుంది. విచారణ జరిపి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.