శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:36 IST)

ఐపీఎల్కు వెస్టిండీస్ క్రికెటర్లను అనుమతించిన బీసీసీఐ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరపున జరిగే మ్యాచ్‌లలో పాల్గొనేందుకు వెస్టిండీస్ క్రికెటర్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుమతించింది. భారత పర్యటనను అర్థంతరంగా తమ పర్యటనను రద్దు చేసుకుని వెస్టిండీస్ క్రికెటర్లు స్వదేశం వెళ్లడం పెద్ద వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. అయినప్పటికీ కరేబియన్ క్రికెటర్లను ఐపీఎల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతిచ్చింది. 
 
ఐపీఎల్ మ్యాచ్‌లలో కరీబియన్ క్రికెటర్లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం బిస్వాల్ మీడియాతో మాట్లాడారు. భారత్తో సిరీస్ మధ్యలో వెస్టిండీస్ క్రికెటర్లు వెనుదిరగడం వల్ల బీసీసీఐ భారీ నష్టం వాటిల్లింది. 
 
దీంతో విండీస్ ద్వైపాక్షిక టూర్లను రద్దు చేసుకుంటున్నట్టు బోర్డు ప్రకటించింది. అయితే ఐపీఎల్లో ఆడేందుకు విండీస్ ఆటగాళ్లను అనుమతిస్తున్నట్టు ఐపీఎల్ ఛైర్మన్ తెలిపారు. విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ సహా డ్రావో, డ్వెన్ స్మిత్, పొలార్డ్, నరైన్ తదితర ఆటగాళ్ల ఐపీఎల్లో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.