శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 29 జనవరి 2017 (23:52 IST)

కిస్ ఆఫ్ డెత్: బారత్‌ను గెలిపించిన బుమ్రా

ఆ బౌలింగ్‌ గర్జారావాన్ని ఏమని వర్ణించా. బాహుబలియన్ ఎఫెక్ట్ అనే ఒక్క పదం మాత్రమే ఆ క్రీడా ప్రావీణ్యంతో సరిపోలుతుందని చెప్పవచ్చు. గెలుపు ఇటా అటా అని తేలని చివరి క్షణంలోనూ తన డెత్ బౌలింగ్ అనుభవాన్ని రంగరించిపోసిన భారత్ బౌలర్ బుమ్రా ఆదివారం రాత్రి ఒక అద్

ఆ బౌలింగ్‌ గర్జారావాన్ని ఏమని వర్ణించాలి?. బాహుబలియన్ ఎఫెక్ట్ అనే ఒక్క పదం మాత్రమే ఆ క్రీడా ప్రావీణ్యంతో సరిపోలుతుందని చెప్పవచ్చు. గెలుపు ఇటా అటా అని తేలని చివరి క్షణంలోనూ తన డెత్ బౌలింగ్ అనుభవాన్ని రంగరించిపోసిన భారత్ బౌలర్ బుమ్రా ఆదివారం రాత్రి ఒక అద్భుతాన్నే సృష్టించాడు. కోట్లమంది ఆశలు వదిలేసుకున్న టి20 గేమ్‌ను  ఒడిసిపట్టి ఇండియాకు అందించాడు. సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా అనుభవం రంగరించి చేసిన అద్భుతమైన బౌలింగ్ విన్యాసానికి బుమ్రా అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

ఏ ఫార్మాట్‌లోనైనా బౌలింగ్ ప్రాముఖ్యత ఏమిటో  నిరూపించిన రెండో టీ-20 పోటీలో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. చివరి బంతి ముగియగానే విజయహాసంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సింహనాదం ఆ విజయ సౌరభాన్ని కోట్లమందికి రుచిచూపింది. 
 
అనుభవజ్ఞుడు నెహ్రా 19వ ఓవర్లో ఒక వికెట్ పడగొట్టి ఆశలు నిలబెట్టినప్పటికీ చివరి రెండు బంతుల్లో వరుసగా 4, 6 పరుగులను సమర్పించుకోవడంతో గెలుపు ఇంగ్లండ్ వైపే నిలిచినట్లయింది. 20వ ఓవర్లో 6 బంతులకు 8 పరుగులు చేయాల్సిన ఉత్కంఠ భరిత క్షణం, స్టేడియం మూగపోయింది. ఒక్క బంతిని బ్యాట్స్‌మన్ బాదితే ఇంగ్లండ్ విజయం ఖాయం. ఆ క్షణంలో బంతిని తీసుకున్న బుమ్రా భారత్ ఆశలను నిలబెట్టాడు. 
 
రెండు వికెట్లు తీసి, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన ఆ అద్భుత బౌలింగ్ ఇంగ్లండ్ జట్టును నెత్తురు చుక్క లేకుండా చేస్తే, 35 వేల పైగా ప్రేక్షకులను, కోట్లాది టీవీ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనితర సాధ్యమైన బౌలింగ్, పక్కా ప్లానింగ్, తిరుగులేని టైమింగ్ అన్నీ కుదిరితే ఆట తీరు ఎలా మలువు తిరుగుతుందో మరోసారి నిరూపించిన క్షణంలో భారత్ గెలుపొందింది. ప్రపంచ క్రికెట్ జట్లలో లేనిది భారత్‌కు ఉన్నది ఒకే ఒక్క తేడా. ఆ తేడా పేరే జస్ప్రీత్ బుమ్రా.
 
ఈ రోజు క్రికెట్ చరిత్రలో బుమ్రా పేరు లిఖితమైంది. అది కలకాలం గుర్తుకుంటుంది. ప్రస్తుత క్రికెటర్లకు రేపటి క్రికెటర్లకు కూడా..