పన్నీరుసెల్వంకు ఉపముఖ్యమంత్రి పదవి లేనట్లే..

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (11:10 IST)

opanneerselvam

పన్నీరుసెల్వం - పళణిస్వామిలకు మధ్య జరుగుతున్న రసవత్తర చర్చలో పన్నీరుకే ఎక్కువ నష్టం కలిగేలా కనిపిస్తోంది. మొదట్లో పన్నీరుసెల్వం పళణితో కలిసేందుకు రెండు డిమాండ్లను ముందుంచారు. అందులో ఒకటి శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి శాశ్వతంగా పంపెయ్యాలి.. 2.జయలలిత మరణంపై విచారణ జరిపించాలి... అయితే ఇది కాస్త చేయలేదు పళణి. దీంతో ఇద్దరి మధ్య మళ్ళీ సఖ్యత కాస్త మరింత దూరాన్ని పెంచింది. 
 
కానీ ఈసారి మాత్రం ఏకంగా కేంద్రం ఇద్దరినీ బుజ్జగించి ఒకటయ్యేందుకు మార్గం సుగుమం చేసింది. ఒకవైపు దినకరన్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయడమేకాకుండా పార్టీలోని వారందరినీ లాక్కునే ప్రయత్నం చేయడం అటు పన్నీరు, ఇటు పళణిలకు అస్సలు ఇష్టం లేదు. కేంద్రం కూడా వీరిద్దరివైపే ప్రత్యేక దృష్టి పెడుతోంది. అందుకే పంతాలకు పోయి ఉన్నది కాస్త ఊడగొట్టుకోవద్దంటూ ఇద్దరికి క్లాస్ ఇచ్చారు బీజేపీ అగ్రనాయకులు.
 
దీంతో పళణిస్వామితో జతకట్టేందుకు పన్నీరుసెల్వం సిద్ధమైపోయారు. తన డిమాండ్లను పట్టించుకోకున్నా.. పదవులు ఇవ్వకున్నా ఫర్వాలేదు.. ఎలాగోలా సర్ధుకుపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట పన్నీరుసెల్వం. ఇది కాస్త పళణికి ప్లస్ అయ్యింది. అందుకే పన్నీరుసెల్వంకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
పన్నీరుసెల్వంకు ఆ విషయం తెలిసినా దాన్ని అస్సలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తామిద్దరం కలిసి ఉంటే వేరొకరు మధ్యలోకి వచ్చే అవకాశం లేదన్నది పన్నీరు ఆలోచన. అందుకే ఇద్దరు శత్రువులు కాస్త మిత్రులు మారిపోనున్నారు. మరో రెండు, మూడురోజుల్లోకి ఇద్దరు విలీనం అయినట్లు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు పన్నీరుసెల్వం, పళణిస్వామిలు. మొత్తం మీద వీరి హైడ్రామాకు త్వరలోనే తెరపడనుంది. దీనిపై మరింత చదవండి :  
Aiadmk Panneerselvam Palaniswami Talk Merger Chief Minister

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాకు తెలుసు.. ఎప్పుడు... రావాలో.. నన్ను ఇబ్బంది పెట్టొద్దండి

విశ్వవిఖ్యాత నటుడు కమలహాసన్ రాజకీయ రంగప్రవేశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రజినీకాంత్ ...

news

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌‍కు సహకరించిన ఆర్ఎంపీ వైద్యుడు

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌కు సహకరించిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని హైదరాబాద్ నగర పోలీసులు ...

news

అత్యంత అరుదైన పింక్ డాల్ఫిన్ (వీడియో)

అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్ఫిన్‌ ఒకటి అమెరికాలోని లూసియానా సముద్రజలాల్లో ...

news

కన్నకూతురిపై 600 సార్లు అత్యాచారం-626 కేసులు.. 12వేల ఏళ్ల కఠిన కారాగార శిక్ష?

కన్నకూతురిపై 600సార్లకు పైగా లైంగిక దాడికి పడిన కీచక తండ్రికి మలేషియా న్యాయస్థానం 12వేల ...