జగన్‌కు సవాల్.. చంద్రబాబుకు ప్రతిష్ట.. కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ ఎమ్మెల్సీ ఎన్నిక

సోమవారం, 20 మార్చి 2017 (08:32 IST)

Jagan-babu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్సీ ఎన్నిక వీరిద్దరికి నిద్రలేమిరాత్రులను మిగిల్చిందట. దీనికి కారణం.. ఈ ఎన్నికల్లో వైకాపా తరపున జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి పోటీ చేయగా, టీడీపీ తరపున మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితం సోమవారం వెలువడనుంది. 
 
అయితే, ఈ మిగిలిన ఎమ్మెల్సీ స్థానాల కంటే ఈ ఎన్నిక ఫలితం చంద్రబాబుకు, జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా తన బాబాయ్‌ను గెలిపించుకోవడం జగన్‌కు ఓ సవాల్‌గా మారింది. అలాగే బీటెక్ రవి విజయం సీఎం చంద్రబాబుకు ప్రతిష్టగా తయారైంది. వివేకానంద రెడ్డి గెలుపు.. జగన్‌కు రాజకీయం ఎంతో అవసరం. కడప జిల్లాలో వైసీపీ ఆధిక్యాన్ని నెలబెట్టుకోవాలంటే వివేకా గెలుపు వైసీపీకి తప్పనిసరిగా మారింది. 
 
అలాగే, పట్టుకోల్పోయిన కడపలో తిరిగి పుంజుకునేందుకు టీడీపీకి ఇదే సరైన అవకాశం. అందుకే ఇరు పార్టీల అధినేతలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఎవరకెన్ని ఓట్లు పడ్డాయే సోమవారం తేలిపోనుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కన్నబిడ్డ చెప్పిన మాట వినడం లేదనీ... తలకిందులుగా చెట్టుకి వేలాడదీత.. కసాయి తండ్రి క్రౌర్యం

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను తలకిందులుగా చెట్టుకు ...

news

సముద్రమార్గంలో 400 కోట్ల దొంగనోట్లు: రూ.2వేల నోట్లంటనే వణుకుతున్న జనం

ఒకటా రెండా.. మూడా.. నాలుగు వందల కోట్ల రూపాయల దొంగనోట్లు కంటైనర్ల ద్వారా చెన్నై హార్బర్‌కు ...

news

ఇక్కడ మాత్రం మోదీ పప్పులుడకవు.. ఎందుకనీ...?

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఘనవిజయాలు సాధించినప్పటికీ, అక్కడ మాత్రం తన పప్పులింకా ఉడకనందుకు ...

news

జగన్ కంచుకోటలో టీడీపీ పాగా వేసేనా? నేడే స్థానిక ఫలితాలు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా టీడీపీ ప్రాభవంలోకి ...