శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : బుధవారం, 13 జులై 2016 (12:55 IST)

తితిదే ఈవో - జేఈఓల మధ్య కోల్డ్ వార్‌...! ఎత్తులు పైఎత్తుల్లో రావు.. రాజు!

తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అతిపెద్ద ధార్మిక క్షేత్రం. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే తిరుమల బాలాజీ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే అంతటి

తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అతిపెద్ద ధార్మిక క్షేత్రం. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే తిరుమల బాలాజీ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే అంతటి ప్రఖ్యాతిగాంచిందీ పుణ్యక్షేత్రం. అలాంటి క్షేత్రంలో పనిచేసే ఉన్నతాధికారులకు ఎంతో గౌరవం ఉంటుంది. స్వామివారి ప్రతినిధులుగా, భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తితిదే ఉన్నతాధికారులదే. అయితే అలాంటి అధికారుల మధ్యే కోల్డ్ వార్‌ జరుగుతుంటే ఇక ఏముంది. తితిదే ఈవో, జేఈఓలకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌పై ప్రత్యేక కథనం..
 
తితిదే ఈఓ (కార్యనిర్వహణాధికారి) సాంబశివరావు, జేఈఓ (సంయుక్త కార్యనిర్వహణాధికారి) శ్రీనివాసరాజు. తితిదేకి ఇద్దరు జేఈఓలు ఉంటారు. ఒకరు తిరుమలలో, మరొకరు తిరుపతిలో ఉంటారు. తిరుమలలో ఉన్న జేఈఓ సేవా టికెట్ల వ్యవహారం చూస్తే, తిరుపతి జెఈఓ పాలనాపరమైన వ్యవహారాలను చక్కదిద్దుతుంటారు. తిరుపతి జేఈఓ కన్నా తిరుమల జేఈఓనే పవర్‌ఫుల్‌.. ఎందుకంటారా చూడండి.
 
తిరుమల జేఈఓ సేవా టికెట్లకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విఐపిలకు అదే స్థాయిలో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరు జేఈఓతో మాట్లాడుతారు. సేవా టికెట్ల కోసం ధరఖాస్తులు చేసుకుంటుంటారు. అందుకే తిరుమల జేఈఓనే పవర్‌ఫుల్‌. తిరుపతి జేఈఓ పోలా భాస్కర్‌. ఈయన మొత్తం తిరుపతి వ్యవహారాలు చూస్తుంటారు. కానీ పెద్దగా ఎక్కడా కనిపించని, పరిచయాలు లేని అధికారి. 
 
ఇక అసలు.. సిసలైన వ్యక్తి ఈఓ. మొత్తం పెత్తనం ఈయన మీదే. తితిదేకి సంబంధించిన ఏ వ్యవహారాలన్నా ఈయన నుంచి వెళ్ళాల్సిందే. అందుకే ఈయనే అత్యంత కీలకం. పాలకమండలి ఉంటుంది కానీ ఆ పాలకమండలే తితిదే ఈఓ మాట వినక తప్పదు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలకు కూడా ఈఓ ఆమోదముద్ర తప్పనిసరి. అలాంటి తితిదే ఈఓకు, జేఈఓలకు మధ్య కోల్డ్ వార్‌ జరుగుతోంది. 
 
ఇది నిన్నటిదో.. మొన్నటిదో కాదు.. ఎన్నో నెలలుగా సాగుతున్నదే. ఈఓ కన్నా ముందుగానే జేఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సీఎంగా నల్లారి కిరణ్‌రెడ్డి (కాంగ్రెస్‌ హయాంలో) ఉన్నప్పుడే ఆయన అండదండలతో శ్రీనివాసరాజు తిరుమలకు వచ్చారు. శ్రీనివాసరాజుకు సొంత జిల్లా చిత్తూరే. పట్టుబట్టి మరీ ఆయన జేఈఓగా వచ్చారు. ఆ తర్వాత ఇంతవరకు ఆయన బదిలీ కాలేదు. 
 
కిరణ్‌ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా సరే ఆయన మాత్రం అక్కడే స్థిరపడిపోయారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఈయన సొంతం. ఇక ఈఓ అంటారా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే అపాయింట్‌మెంట్‌ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి. సీఎంను కాదని ఈఓను ఇక్కడి నుంచి బదిలీ చేసే ధైర్యం ఎవరికీ లేదు.
 
అసలు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్‌ ఎందుకంటారా? జsఈఓపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తిరుమల జsఈఓ భార్య స్వయంగా సేవా టికెట్లను విక్రయిస్తోందని, కోట్ల రూపాయలు సంపాందించిందని, గతంలో పనిచేసిన ఈఓలతో కూడా జsఈఓ శ్రీనివాసరాజు సరైన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతో ప్రస్తుత ఈఓ సాంబశివరావు జsఈఓను ఎలాగైనా బదిలీ చేయించాలన్న ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన జsఈఓ ఇఓనే సీటు నుంచి లేపాలని పన్నాగం పన్నాడు. ఇదంతా పాత సినిమాలో కథలాగా అనిపించినా ఇది నిజం. 
 
ఇది ఒకటే కాదు.. పాలనా వ్యవహారాలకు సంబంధించిన అన్నీ కూడా వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతూనే ఉంది. దీంతో ఈఓ అంటే జేఈఓకు పడదు. జేఈఓ అంటే ఈఓకు పడదు. ఇక్కడ మరో ట్విస్టేమిటంటే జేఈఓ శ్రీనివాసరాజుకు నారా లోకేష్‌ అండదండలుంటే, ఈఓ సాంబశివరావుకు సిఎం ఆశీస్సులు ఉంటాయి. ఇలా ఇద్దరూ ఇద్దరేగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్‌ బహిరంగ రహస్యమే. అయితే గత కొన్నిరోజుల ముందు జరిగిన ఐఎఎస్‌ల బదిలీలో శ్రీనివాసరాజు వెళ్ళిపోతారని అందరూ భావించారు. అయితే ఆయన మాత్రం బదిలీ కాలేదు. చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ బదిలీ అయ్యారు. ఎలాగైనా జేఈఓను బదిలీ చేయించాలని ఈఓ విశ్వప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇద్దరి ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్‌ ఏ స్థాయికి చేరుతుందో వేచి చూడాల్సిందే.