శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (13:31 IST)

భారత్ కంటే ముందు కరెన్సీ నోట్లు రద్దు చేసిన దేశాలేవి?

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తోంది. దేశ ప్రజలతో పాటు, విదేశాల దృష్టిని కూడా ఒక్కసా

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తోంది. దేశ ప్రజలతో పాటు, విదేశాల దృష్టిని కూడా ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని దేశాల్లో ఇలా నోట్లను రద్దు చేశారు? అవి ఏఏ దేశాలు? ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకోసం...
 
ఘనా: 1982లో ఘనా దేశంలో 50 సెడిస్ నోటును రద్దు చేశారు. అయితే విచిత్రంగా ఈ నిర్ణయం తర్వాత ఆ దేశ ప్రజలు బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహించి, ఆస్తులను కూడగట్టుకున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
 
నైజీరియా: 1984లో నైజీరియాలో ముహ్మదు బుహారి ప్రభుత్వ హయాంలో పాత నోట్లన రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టారు. అయితే ఈ నిర్ణయం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక మాంద్యంతో అల్లాడింది.
 
పాకిస్థాన్: డిసెంబర్ 2016 నుంచి పాకిస్థాన్‌లో కొత్త రకం కరెన్సీ చలామణీలోకి వచ్చింది. రద్దు చేయకపోయినప్పటికీ కొత్త నోట్లు వినియోగంలోకి రావడంతో పాత నోట్లు కాలగర్భంలో కలిసిపోయాయి.
 
జింబాబ్వే: ఈ దేశంలో మొదట్లో ట్రిలియన్ డాలర్ నోటు వినియోగంలో ఉండేది. అప్పట్లో జింబాబ్వే ద్రవోల్బణ సమస్యతో కుదేలైంది. రాబర్ట్ ముగాబే ఆ దేశ అధ్యక్షుడు కాగానే ఆ నోట్లను రద్దు చేశారు. వాటి స్థానంలో 0.5 డాలర్ల తక్కువ విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టారు. 
 
నార్త్ కొరియా: 2010లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్- II పాత నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒక్క చర్య వల్ల దేశ ప్రజలంతా తినడానికి తిండి దొరక్క అల్లాడారు. పాత నోట్లపై ఉన్న రెండు సున్నాలను తగ్గిస్తూ వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు.
 
సోవియట్ యూనియన్: మిఖాలి గార్బచేవ్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నల్ల ధన నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
 
ఆస్ట్రేలియా: ప్రపంచ కరెన్సీలో ఓ నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన దేశం ఆస్ట్రేలియా. ప్లాస్టిక్ కరెన్సీని అమలులోకి తెచ్చిన మొదటి దేశం ఆస్ట్రేలియా. ఫేక్ కరెన్సీని అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో సంచలనమైంది. 
 
మయన్మార్: 1987లో బ్లాక్‌మనీని నియంత్రించడానికి అక్కడి మిలటరీ నోటు విలువను దాదాపు 80శాతం తగ్గించింది. దీనివల్ల ఆ దేశం ఆర్థిక స్థితి పతనావస్థకు చేరింది. డబ్బు కోసం ఒకరినొకరు కొట్టుకుని చాలామంది ప్రజలు చావుకు కారణమైంది.