శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Kumar
Last Updated : గురువారం, 4 మే 2017 (13:13 IST)

రెచ్చగొడుతుంది... నగ్న వీడియోలు పంపమంటుంది... ఆ తర్వాత చంపేస్తుంది...

మనం ఎన్నో గేమ్‌లను ఆడుతుంటాం. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడే గేమ్‌లను ఆడి ఉండం. కానీ రష్యాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న "బ్లూ వేల్" గేమ్, ప్రాణాలు తీస్తోంది. ఇది అన్ని గేమ్‌ల వలె సాధారణ గేమ్ కాదు. ఇది ఒక

మనం ఎన్నో గేమ్‌లను ఆడుతుంటాం. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడే గేమ్‌లను ఆడి ఉండం. కానీ రష్యాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న "బ్లూ వేల్" గేమ్, ప్రాణాలు తీస్తోంది. ఇది అన్ని గేమ్‌ల వలె సాధారణ గేమ్ కాదు. ఇది ఒక హిప్నాటిక్ గేమ్. ఈ గేమ్ రష్యా, బ్రిటన్‌లో ఇప్పటివరకు 130 మంది ప్రాణాలు తీసింది.
 
బ్లూ వేల్ గేమ్ టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఈ గేమ్‌ను ఆడటం మొదలుపెట్టినప్పటి నుండి వారితో చాలా తప్పులు చేయిస్తుంది. నగ్న చిత్రాలు, డేటింగ్ వీడియోలు తీసి పంపమంటుంది. ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే మొదటగా చిన్నచిన్న సవాళ్లను ఇస్తుంది. ఆ సవాళ్లను పూర్తి చేసి, వాటికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయాలి. ఈ విధంగా ఒకట్రెండు రోజులు అలవాటయ్యాక గేమ్ స్థానంలో మెంటర్ ప్రవేశిస్తాడు. అసలు కథ అంతా అప్పుడే మొదలవుతుంది.
 
భయంగొలిపే చిత్రాలను చూడమనడం, ఎప్పుడుపడితే అప్పుడు గాఢ నిద్ర నుండి మేల్కొనమని ఆదేశించడం, నగ్న చిత్రాలను పంపమనడం, వారి ప్రియుడు/ప్రియురాలితో డేటింగ్ చేయమని చెప్పి ఆ వీడియోలను పోస్ట్ చేయమనడం, చర్మంపై వివిధ ఆకారాల్లో కత్తితో కోసుకోమనడం వంటి వికృతమైన టాస్క్‌లు ఇస్తాడు.
 
ఈ విధంగా 49 రోజులపాటు ఏదో ఒక టాస్క్ ఇస్తూ చివరగా 50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడు గేమ్ ముగుస్తుందని మెంటర్ వారిని ఆదేశిస్తాడు. అలా చేయకుండా గేమ్ నుండి బయటకు వచ్చేస్తాం అంటే, గేమ్ వెనుక ఉన్న వ్యక్తులు వారికి బెదిరింపు కాల్స్ చేస్తారు. మెంటర్ అప్పటికే గేమ్ ఆడేవారితో అనేక తప్పులు చేయించి ఉంటారు కాబట్టి వారి చిత్రాలు, వీడియోలను బయట పెడతామని, ఇంకా వేరే విధాలుగా చిత్రహింసలు చేస్తామని బెదిరిస్తారు. దీనితో జరిగిన విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
 
ఇప్పటికే ఈ గేమ్‌ను సృష్టించిన ఫిలిప్ బుడేకిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఆరా తీస్తున్నారు. అతడిని ఒక మానసిక రోగిగా గుర్తించి, అతనికి మానసిక వైద్యుని వద్ద చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్, దుబాయ్, అమెరికా, రష్యాల్లో ఈ బ్లూ వేల్ గేమ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. మానసిక నిపుణులు మాత్రం ఈ గేమ్ జోలికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.