రంగంలోకి రాజగురు... రాహుల్‌కు మార్గదర్శిగా ప్రణబ్?

శనివారం, 14 అక్టోబరు 2017 (10:35 IST)

pranab

రాజకీయ అపరచాణక్యుడిగా పేరుగడించిన ప్రణబ్‌ ముఖర్జీ త్వరలో కొత్త పాత్రలో కనిపించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజగురువుగా, ఆ పార్టీ యువనేతకు మార్గదర్శిగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
 
రాష్ట్రపతిగా ప్రణబ్ రిటైర్ అయ్యాక ఆయన రాజాజీ మార్గ్‌లోని ఎనిమిదో నంబర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌లు పదేపదే కలుస్తూ... పార్టీకి మార్గదర్శిగా వ్యవహరించాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో ఆయన కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. 
 
2019 ఎన్నికల్లో మోడీకి ధీటుగా రాహుల్‌ను తీర్చిదిద్దడంలో ప్రణబ్‌ తన వంతు పాత్ర పోషిస్తారని, ఆయన అపార రాజకీయ అనుభవంతో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రణబ్‌ కాంగ్రెస్‌ మార్గదర్శి బాధ్యతలను చేపట్టడం ఖాయమన్నట్లుగా ఆయన వ్యవహారశైలి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
 
ప్రణబ్‌ తన ఆత్మకథ మూడో పుస్తకం (సంకీర్ణ సంవత్సరాలు 1996-2012) ఆవిష్కరణను పురస్కరించుకొని ఓ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇదే చెబుతోంది. ఆ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ను ప్రణబ్‌ వెనకేసుకొచ్చారు. 132 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీని తక్కువగా అంచనా వేయకూడదని, తప్పకుండా మళ్లీ లేచి నిలబడుతుందని నొక్కివక్కాణించారు. ఈ మాటల వెనుక పరమార్థం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెగ తాగేస్తున్నారు... పక్క రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు

తెలంగాణ మద్యం బాబులు… తాగే తాగుడికి కేసులు కేసులే ఖాళీ అయిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త ...

news

స్కూల్ గర్ల్‌పై స్పీకర్ అత్యాచారం.. వాష్‌రూమ్‌కి లాక్కెళ్లి...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ దారుణం జరిగింది. అన్యపుణ్యం తెలియని ఓ చిన్నారిపై పాఠశాలలో ...

news

జలసిరి : శ్రీశైలంకు వరద తాకిడి.. అన్ని గేట్లు ఎత్తివేత (Video)

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ...

news

హైదరాబాద్‌లోనూ బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ...