Widgets Magazine

గుజరాత్ పోల్స్ : బీజేపీ గుండెల్లో గుబులు

సోమవారం, 11 డిశెంబరు 2017 (14:10 IST)

Widgets Magazine
modi - shah

గుజరాత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్టు సమాచారం. దీంతో రెండోదశ ఎన్నికల పోలింగ్‌ అత్యంత కీలకంకానుంది. ఈ దశలో వీలైనంతమేరకు భారీ పోలింగ్ అయ్యేలా కమలనాథులు ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఎందుకంటే, గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పటి హవా ఇపుడు బీజేపీకి కనిపించడం లేదు. దీనికితోడు బీజేపీని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఫలితంగా గుజరాత్ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 
 
ఇప్పటివరకు గుజరాత్ ఎన్నికల్లో గెలుపోటములను పటీదార్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు శాసిస్తూవచ్చారు. మోడీ సీఎంగా ఉన్నంతవరకు ఈ వర్గం వారు బీజేపీకి అండగా నిలబడ్డారు. మోడీ ప్రధాని అయ్యాక సీన్ రివర్స్ అయింది. పటీదార్ ఉద్యమ పుణ్యమాని ఈ సామాజికవర్గానికి బీజేపీ బద్ధశత్రువుగా మారిపోయింది. 
 
అదేసమయంలో కాంగ్రెస్ పార్టీతో పటీదార్లు చేతులు కలిపారు. దీనికితోడు దళిత యువనేతలంతా కాంగ్రెస్ పార్టీకే జైకొట్టారు. ఫలితంగా మాకు ఎదురేలేదనే ధీమా ప్రదర్శించే మోడీ అండ్ టీమ్.. ఇప్పుడు టెన్షన్ పడుతోంది. గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే బీజేపీలో నరేంద్ర మోడీ, అమిత్ షాల హవా తగ్గనుంది. పైగా, వీరికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకే గుజరాత్ ఎన్నికలను మోడీ, షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఇద్దరు నేతలకు గుజరాత్ సొంత రాష్ట్రం కావడంతో మరింతగా దృష్టికేంద్రీకరించారు. 
 
ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు మోడీ సర్కారుకు సెమీ ఫైనల్‌లా మారాయి. గుజరాత్‌లో కనిపిస్తున్న ప్రతికూలతలు, కమలదళాన్ని కలవరపరుస్తున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు... ఈ మూడున్నరేళ్లుగా మోడీ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపించనుందనే వాదనలు పెరుగుతున్నాయి. మొత్తంమీద గుజరాత్ ఎన్నికలు కమలనాథుల గుండెల్లో గుబులు రేపుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్ మెట్రో రైళ్ళకు అనూహ్య స్పందన

హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలకు భాగ్యనగరివాసుల నుంచి ...

news

రూ.37,54,06,23,616 ఇదీ ప్రధాని మోడీ ప్రచార ఖర్చు

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ చాయ్ వాలా అని, ఆయన కింది స్థాయి నుంచి ప్రధాని పదవిని ...

news

దళితుల ముక్కుతో నేలకు రాయించి.. మురికి నీటిలో మునక..

తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల బీజేపీ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ నేత పేరు భరత్ ...

news

ఖాకీ డ్రెస్ ఉందనీ భార్యను వ్యభిచారం చేయమన్న హెడ్ కానిస్టేబుల్

అతడో హెడ్ కానిస్టేబుల్. వంటిపై ఖాకీ డ్రెస్ ఉందనీ వ్యభిచారం చేయమని కట్టుకున్న భార్యపైనే ...