శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (14:28 IST)

అమ్మకానికి 'తిరుపతి మేయర్' పదవి.. ధర రూ.35 కోట్లు.. నారా లోకేష్‌ వద్దకు పంచాయతి!?

తిరుపతి.. ఈ ప్రాంతం అంటే తెలియని వారుండరు. ప్రతి ఒక్కరికీ తిరుపతి గురించి.. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలుసు. తిరుమల కొలువై ఉన్న తిరుమల క్షేత్రంకు వెళ్లాలంటే తిరుపతి నుంచి వెళ్లాల్సిందే. అలా తిరుపతి

తిరుపతి.. ఈ ప్రాంతం అంటే తెలియని వారుండరు. ప్రతి ఒక్కరికీ తిరుపతి గురించి.. తిరుపతి ప్రాముఖ్యత గురించి తెలుసు. తిరుమల కొలువై ఉన్న తిరుమల క్షేత్రంకు వెళ్లాలంటే తిరుపతి నుంచి వెళ్లాల్సిందే. అలా తిరుపతి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాంటి తిరుపతిలోని నామినేటెడ్‌ పదవులు కూడా ఎంతో ముఖ్యమైనదే. ఎలాగంటారా.. ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటే అతి సులువుగా ప్రపంచంలోని ప్రముఖలందరూ పరిచయమవుతారు. కారణం శ్రీవారే. అందుకే కొంతమంది క్రిందిస్థాయి నాయకులు ఎలాగైనా నామినేటెడ్‌ పదవులను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. అసలు ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కదా.. ఏ పదవి కోసం అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవండి.
 
తిరుపతిని నగర పాలక సంస్థగా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఎన్నికలు అసలు జరుగనే లేదు. చిత్తూరు జిల్లాలోనే చిన్నపట్టణమైన చిత్తూరు నగరపాలక సంస్థను ప్రకటించిన తర్వాత ఎన్నికలు కూడా జరిగిపోయాయి. మేయర్‌ కూడా ఎన్నికయ్యారు. పాతక్షలతో మేయర్‌ హత్యకు గురయ్యారు. ఇదంతా పక్కనపెడితే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలకు మాత్రం ఎన్నో అడ్డంకులు వచ్చి పడ్డాయి. తిరుపతి రూరల్‌లోని కొన్ని ప్రాంతాలను నగరపాలక సంస్థలోకి కలపాలన్న ప్రతిపాదనను అప్పుడు పెడితే ఆ ప్రతిపాదన కాస్త ఎన్నికలు జరుగకుండా ఆలస్యకానికి కారణమైంది.
 
చివరకు 2015 సంవత్సరంలో చివరలోనైనా ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే ఆ ఆశ మొత్తం నిరాశగా మారింది. ఇక 2016 సంవత్సరం మొదట్లోనైనా అనుకున్నారు. అదీ లేదు. స్వయంగా పురపాలక మంత్రి నారాయణే స్వయంగా జూన్‌ నెల అని ప్రకటించారు. అది కూడా జరుగలేదు. తాజాగా బుధవారం విజయవాడలో తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలపై మంత్రి నారాయణతో సమావేశమైన సీఎం అక్టోబరు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరులో ఎలాగైనా ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
 
ఇంకేముంది ఆయన ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే స్థానిక నేతల్లో సంతోషం వ్యక్తం కావడమే కాకుండా ఫైరవీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రూ.25 కోట్ల ఇవ్వాలని ముందుకు వచ్చిన కొంతమంది నేతలు ప్రస్తుతం పోటీ పెరగడంతో మరో రూ.10 కోట్ల రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే అక్షరాల 35 కోట్ల రూపాయలు. ఒక మేయర్‌ పదవికి ఇంత మొత్తమా అని ఆశ్చర్యపోవచ్చు. అయితే ఇది నిజమే... తిరుపతి వంటి ప్రాంతంలో నగరపాలక సంస్థ వంటి ప్రాముఖ్యత కలిగిన సంస్థకు మేయర్‌ అంటే సాదాసీదా విషయం కాదు. 
 
ఒక్క మాటలో చెప్పాలంటే తిరుపతి నగర్‌ మేయర్‌ పదవి సీఎంతో సమానమని ఇక్కడి నేతలు భావిస్తుంటారు. అందుకే ఈ పదవి కోసం పైరవీలు తారా స్థాయిలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే నారా లోకేష్‌ను కలిసిన కొంతమంది స్థానిక నేతలు 25 కోట్ల రూపాయలు బేరం పెట్టారు. అయితే మేయర్‌ పదవిని ఆశించే వారి సంఖ్య పెరగడంతో డబ్బును కూడా పెంచేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ నారా లోకేష్‌ ముందు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే తిరుపతికి చెందిన స్థానిక నేతలు హైదరాబాద్‌ బాట పట్టారు. నారాలోకేష్‌ అపాయింట్మెంట్‌ కోసం పడిగాపులు కాస్తున్నారు.
 
కొంతమంది నేతలు వారికున్న పలుకుబడితో నారా లోకేష్‌కు సన్నిహితుల నుంచి సిఫారసు చేయించుకుంటుండగా మరికొంతమంది నేరుగా తమతో లోకేష్‌‌కున్న పరిచయంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంమీద తిరుపతి నగరపాలక సంస్థ మేయర్‌ పదవి రూ.35 కోట్ల పలుకుతుండటం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.