Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు...?

సోమవారం, 12 జూన్ 2017 (14:37 IST)

Widgets Magazine
venkaiah naidu

వెంకయ్యనాయుడు. పెద్దగా పరిచయం లేని వ్యక్తి. నెల్లూరు జిల్లాలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశ రాజకీయాలను శాసించేస్థాయికి చేరిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. అందుకే ప్రధానికే వెంకయ్య సలహాలు ఇస్తుంటారు. మోడీ ప్రవేశపెట్టే పథకాలలో ఎక్కువ వెంకయ్య చెబితేనే అమలు చేస్తున్నారంటే ప్రధాని ఆయన మాటలకు ఎంత విలువ ఇస్తారో ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం వెంకయ్య కేంద్ర సమాచార శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. అయితే వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధాని అనుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున వెంకయ్యే అభ్యర్థని ఎవరో చెప్పలేదు స్వయంగా వెంకయ్యే చెప్పడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఇప్పటివరకు బీజేపీ తరపున రాష్ట్ర అభ్యర్థిగా జార్ఖండ్‌కు చెందిన గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్ము పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఉన్నట్లుండి చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు కూడా పరిశీనలో ఉందని చెప్పాడు. ఆ కార్యక్రమానికి హాజరైన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 
 
సమావేశంలో వెంకయ్య స్పీచ్ తర్వాత ఒకరి నొకరు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థి తానేనంటూ వెంకయ్య చెప్పడం పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధానమంత్రి గోప్యంగానే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారట. ఇదే కనుక జరిగితే నీలం సంజీవరెడ్డి తర్వాత రాష్ట్రపతిగా ఉన్న రెండో తెలుగు వాడు వెంకయ్యనాయుడే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pm Modi President Election Venkaiah Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత మేనల్లుడు దీపక్ కొత్త నాటకం... ఏంటది..?

తమిళనాడులో జరుగుతున్న ట్విస్ట్‌లు ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయాల్లో బంధుత్వం అనేది ...

news

కోర్కె తీర్చమన్న భార్య.. నావల్ల కాదన్న భర్త... పోటీపడి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు!

ఓ భార్యాభర్తలు పోటీపడి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తన కోర్కెను ...

news

కొండచిలువ రోడ్డు దాటుతోంది.. ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా?

ఆస్ట్రేలియాలో కొండచిలువను కాపాడేందుకు ఓ యువకుడు సాహసం చేశాడు. కొండ చిలువ రోడ్డును ...

news

ఫేస్ బుక్ పరిచయం.. పెళ్లి చేసుకోమని ఇంటికెళ్ళి అడిగాడు.. పొమ్మంది.. కత్తితో?

ఫేస్ బుక్ పరిచయం ఆ యువకుడిని ప్రేమోన్మాదిగా మార్చింది. ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ మహిళను ...

Widgets Magazine