శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:42 IST)

త్వరలో 'అమ్మ' డిశ్చార్జ్.. అమెరికా ఆసుపత్రికి 'రోబో' రజినీకాంత్.. రాక్‌స్టార్ కరుణానిధి నిజంగా..

తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ నేతల ఆరోగ్యానికి ఏమైందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత నెల 22వ తేదీ నుంచి తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలోనే చికిత్స పొంద

తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ నేతల ఆరోగ్యానికి ఏమైందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత నెల 22వ తేదీ నుంచి తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందనీ, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే, వైద్యులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. 
 
నిజానికి ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు, వదంతులు వచ్చాయి. కేవలం జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో గత నెల 22వ తేదీన చేరిన జయలలిత.. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు లండన్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణుడుతో పాటు.. ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ప్రత్యేక వైద్య బృందం, సింగపూర్ నుంచి ఇద్దరు ఫిజియో వైద్య నిపుణులు చెన్నైకు వచ్చారు. వీరంతా కలిసి ఆమెకు చికిత్స చేశారు. ఫలితంగా ఆమె కోలుకుని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అన్నాడీఎంకే శ్రేణులకు ముందుగానే దీపావళి పండుగ చేసుకున్నంత సంబరంగా మారాయి. 
 
మరోవైపు.. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఉన్నట్టుండి హఠాత్తుగా అమెరికాకు వెళ్లారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారనీ, అందుకే చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికాగా అమెరికా, సింగపూర్ తదితర విదేశాల్లో చికిత్స పొంది.. సంపూర్ణ ఆరోగ్యంతో స్వదేశానికి తిరిగివచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడం, అమెరికాకు వెళ్లడం రాష్ట్రవాసులను ఒకింత ఆందోళనకు గురిచేసింది. 
 
అయితే, జయలలిత, రజినీకాంత్ ఆరోగ్యం ఆ విధంగా ఉంటే.. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రం 93 యేళ్ల వయసులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన నడవలేక చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ.. చలాకీగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ... వృద్దాప్య వయసులోనూ తమిళనాడు హెల్తీ రాక్‌స్టార్‌ను తలపిస్తున్నారు. 'అయ్య'గా పిలుచుకునే కరుణానిధి సెంచరీకొట్టి ముందుకు సాగుతారని డీఎంకే నాయకులు అంటున్నారు.