శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2015 (14:37 IST)

తెలుగుదేశంలోకి కోట్ల... చంద్రబాబు భారీ తాయిలాలు?

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెసె్ పార్టీ రాష్ట్రానికి చెందిన పెద్ద పెద్ద నాయకులను ఒక్కొక్కరిని చేజార్చుకుంటోంది. 2014 సాధారణ ఎన్నికల తరువాత కొద్ది మంది నాయకులు మిగిలి పోయారు. వారు కూడా ప్రస్తుతం ఒక్కొక్కరు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. వీరి బాటలోనే నడుస్తున్నారు. మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వినివస్తోంది. 
 
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గాంధీ కుటుంబానికి విధేయులు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా తండ్రిబాటలో ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కోట్ల విజయభాస్కర రెడ్డి రెండు మార్లు సిఎం అయ్యారు. ఒక్కమారు కేంద్ర మంత్రిగా పని చేశారు. సూర్యప్రకాష్ రెడ్డి కూడా మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. కానీ ఆయన 2014 ఎన్నికల తరువాత సూర్యప్రకాష్ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో టిడిపి యువనేత నారా లోకేషను కోట్ల తనయుడు రాఘవేంద్రా రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. 
 
నారా లోకేష్ ను కలిసిన విషయాన్ని కోట్ల కుటుంబం ధృవీకరిస్తోంది. కానీ పార్టీలో చేరుతున్న అంశాలను మాత్రం ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కోట్ల సుజాతమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కోట్ల వచ్చే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున రాఘవేంద్రా రెడ్డికి ఎంపి టికెట్టు ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు కేఈ కృష్ణ మూర్తి కుటుంబం కూడా అంగీకరించినట్లు సమాచారం. మరి ఏమవుతుందో వేచి చూడాల్సిందే.