Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెద్ద నోట్ల రద్దుపై భీష్ముడు ఏమంటున్నాడు..! మోడీ పారిపోతున్నారా?

గురువారం, 1 డిశెంబరు 2016 (15:01 IST)

Widgets Magazine
Why Advani wants a back seat in Parliament
LK Advani

పాత పెద్దనోట్ల రద్దుపై స్పందిస్తే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలా లేకుండా ఆ పార్టీ నేతలు స్పందించాలి కానీ.. ఈ భీఘ్ముడు ఏందీ స్పందించడమేంటి అనుకుంటున్నారా... భీఘ్ముడంటే పార్టీకి పెద్ద దిక్కని. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది బీజేపీలో ఎవరు పెద్ద దిక్కో.
 
కమలం పార్టీలో ఒక మంచి సాంప్రదాయం ఉంది. పార్టీని నమ్ముకుంటే చాలు. ఏ పని అయినా అప్పగిస్తారు. ఇంకాస్త సమర్థత ఉంటే చాలు ప్రధాని అయినా చేసేస్తారు. అందుకు నిజంగా ఆ పార్టీని అభినందించాల్సిందే. కానీ పెద్దలను గౌరవించాలన్న చిన్న పాటి సాంప్రదాయాన్ని మరిచిపోతున్నట్లున్నారు ఆ పార్టీలోని కొందరు నాయకులు. వెంకయ్య నాయుడు మొదలుకుని మోడీ వరకు తొలినాళ్ళలో పార్టీ కోసం కరపత్రాలు పంపిణీ చేసినవారే. గోడలకు పోస్టర్లు అంటించిన వారే. అది వారి భవిష్యత్తును ఇంతగా తీర్చిదిద్దుతుందని అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చు.
 
వస్తువు రాను రాను ఉపయోగరకం కాకపోతే పక్కన పడేస్తాం. కానీ రాజకీయాల్లో వేలు పెట్టి నడిపించిన వాడిని పాఠాలు చెప్పి ప్రయోజకుడిని చేసిన వారిని పక్కన పెట్టడం ఎవరికైనా బాధ కలిగించే విషయం. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నారబ్బా అనుకుంటున్నారా.. దేశమంతా నోట్ల రద్దుపై ఇంత హడావిడిగా ఉంటే తన శిష్యుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆ గురువు ఏ విధంగా చూస్తున్నాడో తెలియడం లేదు. ఆ గురువు ఎవరో కాదు కమల దళపతి అద్వానీ. ఇక శిష్యుడు ఎవరో మీకే అర్థమైందిగా.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మోడీ పార్టీలో కూడా చెప్పకుండానే తీశాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.
 
అయితే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా ఈ విషయంలో మోడీ పార్టీ పెద్ద అభిప్రాయాలు తీసుకుంటున్నాడా అన్న ప్రశ్న వినిపిస్తుంది. రాజకీయంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దగా అనుభవం అవసరం లేకున్నా దానిని అమలు చేయడంలో ఖచ్చితంగా కావాలి. మోడీలో ఉన్న ఆ అనుభవ రాహిత్యమే ఇప్పుడు జనాన్ని బ్యాంకుల ముందు నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఆర్బీఐ అధికారులనే నమ్ముకుని ముందు కెళ్ళిన మోడీకి కూడా తప్పు చేశానన్న ఫీలింగ్‌ కలిగి ఉండవచ్చు. అందుకే ఛలోక్తులతో గంటల తరబడి ప్రసంగాలు చేసే మోడీ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేక పార్లమెంట్‌కు రాలేకపోయాడు. అందుకే బీజేపీపిలోనే మోడీకి వ్యతిరేకత పెరుగుతోంది అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఈ సమయంలో అయినా పార్టీలో ఉండే పెద్దలను మోడీ మర్యాద పూర్వకంగా కలిస్తే మంచిదనిపిస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహేతర సంబంధం.. తండ్రి హత్య.. తల్లి జైలుకు.. రోడ్డున పడిన ఏడాది కుమారుడు..

వివాహేతర సంబంధం వద్దని వారించడంతో ఫైర్ అయిన ఓ మహిళ ప్రియుడితో చేతులు కలిసి భర్తను హత్య ...

news

చిత్తూరు జిల్లాలో కరెన్సీ మాఫీయా.. భారీ కమీషన్‌తో పెద్ద నోట్ల మార్పిడి

ఆధ్మాత్మిక క్షేత్రం చిత్తూరు జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. పాత ...

news

ముకేష్ అంబానీ బంపర్ ఆఫర్... జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్... 31-03-17 వరకూ ఫ్రీ

ముకేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియో హేపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఉచిత సర్వీసులను ...

news

శ్రీకాళహస్తిలో హైటెక్ వ్యభిచారం.. వాట్సాప్‌లో ఫోటోలు.. రేటు...

చిత్తూరు, శ్రీకాళహస్తిల కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన అమ్మాయిల ...

Widgets Magazine