శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By IVR
Last Modified: శుక్రవారం, 20 జూన్ 2014 (21:48 IST)

సాకర్ అండ్ సెక్స్... బ్రెజిల్ లో విచ్చలవిడి శృంగారం... కార్డ్ పేమెంట్‌తో గాళ్స్

బ్రెజిల్ లో జరుగుతున్న సాకర్ కప్ గురించి చర్చ సంగతేమోగానీ, బ్రెజిల్ లో పోటీలు జరుగుతున్న 12 పట్టణాల్లో విచ్చలవిడి శృంగారం జరుగుతోందట. నెల రోజుల్లోపే అక్కడ 20 లక్షల కండోమ్ లు అమ్ముడయ్యాయంటే సెక్స్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆటగాళ్లు తమ జట్టును విజయ తీరాలకు చేర్చాలంటే సెక్స్ తప్పనిసరి అనే నమ్మకంలో ఉన్నారట. అంతేకాదు జట్టు కోచ్ లు అయితే క్రీడాకారులకు సెక్స్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. 
 
అవకాశం ఉంటే భార్య లేదా గర్ల్ ఫ్రెండును వెంట తెచ్చుకోవచ్చని కొన్ని జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లకు సూచనలు కూడా చేశాయి. దీంతో ఆటగాళ్లు శృంగారంలో రెచ్చిపోతున్నారు. ఇదే అదనుగా బ్రెజిల్ లో పోటీలు జరుగుతున్న 12 పట్టణాల్లో ఆయా ప్రదేశాల్లో అమ్మాయిలు ఆటగాళ్లతోపాటు ఆటను చూసేందుకు వస్తున్న సందర్శకుల వెంట పడుతున్నారట. 
 
తమ వద్ద డబ్బు లేదని ఎవరయినా అంటే, క్రెడిట్ కార్డ్ ఉన్నా చాలని ఆఫర్లు ఇస్తున్నారట. దీంతో సాకర్ కప్ పోటీలు జరుగుతున్న పట్టణాల్లో అద్దె గదులు పూర్తిగా ఫుల్ అయిపోయాయట. కొన్నిచోట్ల అయితే గదులను ముందుగా బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో గదుల అద్దె అమాంతం పెరిగిపోయిందట.
 
ఇకపోతే పోటీల్లో పాల్గొంటున్న జట్లలో ఏయే జట్ల క్రీడాకారులు సెక్సులో పాల్గొంటున్నారు... ఎవరు పాల్గొనలేదనే చర్చ కూడా నడుస్తోంది. ఆ వివరాలను చూస్తే... ఇటలీ దేశానికి చెందిన ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్ సెక్స్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చేశాడట. ఐతే పోటీలో పాల్గొనే ముందు రోజు మాత్రం సెక్సులో పాల్గొనవద్దని సూచన చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.
 
ఇక సెక్స్ విషయాల్లో కొన్ని జట్ల కోచ్ లు సెక్సు కూడదని నియంత్రణ పెడితే, మరికొన్ని జట్ల కోచ్ లు ఇష్టమొచ్చినంత సేపు సెక్సులో పాల్గొనవచ్చని స్వేచ్చనిచ్చేశారట. జర్మనీ, స్పెయిన్ జట్ల కోచ్ లు మ్యాచ్ కు ముందు సెక్సులో పాల్గొనరాదని నిబంధన విధించాయి. అమెరికా, ఇంగ్లండు జట్ల కోచ్ లు సెక్సు విషయంలో ఆటగాళ్ల ఇష్టానికి వదిలేశాయి. అలాగే ఉరుగ్వే, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల జట్ల కోచ్ లు కూడా ఆటగాళ్ల సెక్స్ విషయంలో ఎలాంటి నియంత్రణ పాటించలేదు. ఇక సెక్సుకు పూర్తిగా అంగీకరించని కోచ్ లు మరీ అంతగా కావాలనిపిస్తే హస్త ప్రయోగం చేసుకోవచ్చని సలహాలు ఇస్తున్నారట. ఇలా మొత్తమ్మీద సాకర్ కప్ జరుగుతున్న బ్రెజిల్ సెక్స్ సెంటర్ గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఇక 60 ఏళ్ల తర్వాత బ్రెజిల్ లో జరుగుతున్న సాకర్ కప్ ద్వారా ఆ దేశానికి భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తుందని మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఐతే ఈ ఖర్చుకు తగిన రాబడి లేకపోవడంతో దేశ ఆర్థిక స్థితి పాతాళానికి దిగజారింది. పేదరికం తాండవిస్తోంది. ప్రజల మధ్య భారీ ఆర్థిక అసమానత నెలకొని ఉంది. కటిక దరిద్రంలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే బ్రెజిల్ ప్రభుత్వం మిలియన్ల కొద్దీ ఖర్చుపెట్టి సాకర్ పోటీలను నిర్వహించడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 
పేదరికంలో మగ్గుతున్న కారణంగా స్త్రీలు వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నారు. బాల్యంలోనే సెక్స్ వృత్తిని స్వీకరిస్తున్నారు. 3 లక్షల మంది మైనర్ బాలికలు పడుపు వృత్తిలో కొనసాగుతున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అవగతమవుతుంది. ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆకలి, దరిద్రం కారణంగా దోపిడీలు, హత్యలు ఆందోళనకర స్థాయిలో తాండవిస్తున్నాయి. వీటన్నిటి మధ్య బ్రెజిల్ దేశం సాకర్ పోటీలను నిర్వహిస్తోంది.