శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 16 జులై 2015 (10:27 IST)

హలో...! దిస్ ఈజ్ న్యూ హారిజాన్స్.. ఫ్రమ్.. ఫ్లూటో జోన్

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన న్యూ హారిజాన్స్ వ్యోమనౌక పెద్ధ ఘనతనే సాధించింది. మంగళవారం ప్లూటో గ్రహాన్ని దాటేసింది. అక్కడ నుంచి 13 గంటల తరువాత భూమిని పలకరించింది. హలో...! ఐయామ్ హియర్ అన్నట్లు పలకరించింది. ఇది విన్నప్పటి నుంచి నాసా శాస్త్రవేత్తల ఆనందానికి అంతులేదు. ముందుగా ప్రోగ్రామ్ చేసి ఉంచిన సందేశాలు, ఫోన్ కాల్ ను న్యూ హారిజాన్స్ ప్రసారం చేసిందని బుధవారం నాసా వెల్లడించింది. 
 
సౌరకుటుంబం చివరలో నెప్ట్యూన్ తర్వాతి కక్ష్యలో ఉన్న ప్లూటోను న్యూ హారిజాన్స్ మంగళవారం ఉదయం 12,500 కి.మీ. సమీపం నుంచే దాటి వెళ్ళింది. మానవ నిర్మిత మైన ఒక వ్యోమనౌక ప్లూటో సమీపంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఆటోమోడ్‌లో గంటకు 49 వేల కి.మీ. వేగంతో గ్రహశకలాలతో కూడిన కూపర్ బెల్ట్ ప్రాంతంలో మరింత ముందుకు ఈ వ్యోమనౌక ప్రయాణిస్తోందని నాసా తెలిపింది. 
 
ప్లూటోను సమీపించిన సమయంలో యాంటెన్నాలను ఈ వ్యోమనౌక అటువైపుగా తిప్పుకొన్నందున భూమితో 21 గంటల పాటు సంబంధాలు తెగిపోయి ఉత్కంఠకు గురిచేసిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కూపర్ బెల్ట్ లోని వస్తువుల గురించి న్యూ హారిజాన్స్ పెద్దమొత్తంలో ఫొటోలు, సమాచారం సేకరిస్తోందని, ఆ సమాచారమంతా భూమికి పంపేందుకు 16 నెలలు పడుతుందని తెలిపారు.