శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (13:13 IST)

ఓనం పండుగ నాడు బ‌లిని తొక్కేసిన వామనుడు... బీజేపీ త‌మాషాలు... మండిప‌డిన కేర‌ళ ప్ర‌జ‌లు

కేర‌ళ‌: ఓనం పండుగ సాక్షిగా కేర‌ళ‌లో కొత్త వివాదం మొద‌లైంది. దీనిని బీజేపీ అగ్ర‌నేత‌లే ఆజ్యం పోశారు. బి.జే.పి కేరళలలో మరో సైధ్ధాంతిక వివాదానికి తెరలేపింది. కేరళ ప్రజలు ఆనందంతో జరుపుకునే ఓనం పండుగను వామన జయంతిగా వర్ణిస్తూ, అమిత్‌ షా పోస్టర్‌ను వేయటంతో

కేర‌ళ‌: ఓనం పండుగ సాక్షిగా కేర‌ళ‌లో కొత్త వివాదం మొద‌లైంది. దీనిని బీజేపీ అగ్ర‌నేత‌లే ఆజ్యం పోశారు. బి.జే.పి కేరళలలో మరో సైధ్ధాంతిక వివాదానికి తెరలేపింది. కేరళ ప్రజలు ఆనందంతో జరుపుకునే ఓనం పండుగను వామన జయంతిగా వర్ణిస్తూ, అమిత్‌ షా పోస్టర్‌ను వేయటంతో ఈ వివాదం మొదలయింది. దీనిపై కేరళ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు.
 
మహా బలి ద్రవిడ జాతికి చెందిన చక్రవర్తి మహాదాత. గొప్పవాడు. ధనిక పేద బేధంలేకుండా ప్రజానురంజకంగా పరిపాలించాడు. అతని కీర్తి దిశదిశలా వ్యాపిస్తోంద‌ని, త‌ననే కించ‌ప‌రిచే స్థాయికి చేరాడ‌ని విష్ణుమూర్తి భావించాడు. విష్ణుమూర్తి వామనుడన్న పేరుతో మరగుజ్జు రూపం ధరించి బలి చక్రవర్తి వద్దకు పంపారు. ఆ వామనుడు బలి చక్రవర్తిని మూడడుగుల స్థ‌లం దానం అడిగాడు. బలి చక్రవర్తి ఇస్తానన్నాడు. దానితో అతను ఒక అడుగుతో ఆకాశాన్ని, మరో అడగుతో భూమండలాన్ని ఆక్రమించాడు. 
 
ఇక స్థ‌లం లేకపోవటంతో మూడవ అడుగును బలి చక్రవర్తి నెత్తిన పెట్టి అతనిని పాతాళంలోకి తొక్కి వేశాడు వామనుడు. ఇది ఆర్యులు సృష్టించిన కథ. దీనిని కేరళ ప్రజలు అంగీకరించరు. బలిచక్రవర్తి ద్రావిడ రాజు కావటంతో అన్యాయంగా అతనిని తొక్కివేశారని, అతను పాతాళం నుండి ఏడాదికొక రోజు వచ్చి తన ప్రజలకు ఆనందాన్ని చేకూర్చుతాడని కేరళ ప్రజలు భావిస్తారు. బలి చక్రవర్తి వచ్చే రోజును ఓనం పండుగగా కేరళీయులు జరుపుకుంటారు. 
 
ద్రవిడ రాజులను, రాక్షసులుగా దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఆర్యులు అనేక పురాణాలు రాశారు. పురాణాలు రాయటం మాత్రమే కాదు. ద్రావిడులలో గొప్పగొప్ప నాయకులను తమ మోస పూరిత విధానాల ద్వారా చంపేశారు. తాము చేసిన హత్యలను సమర్ధించుకోవటానికి వారికి దుష్ట స్వభావాలను అంటగట్టారు. అలా హత్యగావించబడిన ద్రావిడ రాజే బలిచక్రవర్తి. అందుకే కేరళ ప్రజలకు బలి చక్రవర్తి అంటే అభిమానం. తరతరాలుగా ఆర్య సిధ్ధాంతాన్ని నిరసిస్తూ, తమ నాయకుడిని తలచుకుంటూ ఓనం పండుగను జరుపుకుంటారు. 
 
దేశం ప్రజాస్వామ్య లౌకిక దేశంగా ఉన్నప్పటికీ ఆర్య సంతతి దుష్ట బుధ్ధి నేటికీ మారలేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇతరుల నమ్మకాలను అభిప్రాయాలను గౌరవించాలన్న ఆలోచనే వారికి లేదు. అడుగడుగునా ద్రవిడ జాతిని అవమానించడమే వారి లక్షణం. ఆర్య సిధ్ధాంతానికి ప్రతీకయైన బిజేపీ ఆ విధానాలనే అమలు జరుపుతోంద‌ని ఆరోపిస్తున్నారు. బలి చక్రవర్తి వచ్చే రోజుకు ప్రతీకగా జరుపుకునే ఓనం పండుగను, బలి చక్రవర్తిని అణగద్రొక్కిన వామనుడి జయంతిగా వర్ణిస్తూ బి.జే.పీ నాయకుడైన అమిత్‌ షా పోస్టర్లు వేయటం, ద్రవిడ జాతికి చెందిన కేరళ ప్రజలను, వారి విశ్వాసాలను అవమానపరచటమే అని అంటున్నారు. 
 
కేవలం అవమానపరచటం కోసం మాత్రమే కాదు. తమ ఆర్య సిధ్థాంతాన్ని , తమ ఆధిపత్యాన్ని ద్రావిడ ప్రజలందరూ అమోదించాలన్న ఆధిపత్య ధోరణి ఇందులో ఇమిడి ఉన్నదని అంటున్నారు. అందుకే కేరళ ప్రజలు దీనిని ముక్తకంఠంతో ఖండించారు. ద్రావిడ ప్రజలందరూ ఈ ఆధిపత్య ధోరణిని నిరశించవలసిన సమయమాసన్నమైందని ఎలుగెత్తి చాటారు. ఈ భారతదేశం ఐక్యగా ఉండాలంటే, బి.జే.పీ ఇలాంటి వెర్రిమొర్రి వేషాలను మానుకోవాలని హెచ్చ‌రిస్తున్నారు.