శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ESHWAR
Last Updated : ఆదివారం, 13 జులై 2014 (17:25 IST)

ఆ ప్రాంత రెవెన్యూ సిబ్బందికి జీతాలు ఎవరిస్తారు?

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పరిస్థితి అయోమయంలో పడింది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను తెలంగాణలోకి బదిలి చేయనున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, పంచాయతి సిబ్బంది, రెవెన్యూ అధికారులును ఏమి చేస్తారన్నది ఇంత వరకు స్పష్టత లేదు. 
 
వారికి నెలసరి జీతాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదంటే తెలంగాణా ప్రభుత్వం చెల్లిస్తుందా?
అనేది అటు ఉద్యోగస్తులకు గానీ ఉన్నత స్థాయి అధికారులకు దగ్గర కానీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే జూన్ రెండు నుంచి ఈ గ్రామాల పర్యవేక్షణ అంతా సీమాంధ్ర జిల్లాలకే ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తమకు జీత భత్యాలు సంగతి తెలియక ఉద్యోగుస్తులు గందరగోళం పడుతున్నారు.