Widgets Magazine

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీ..? (video)

బుధవారం, 25 జులై 2018 (16:01 IST)

2019 ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ వుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరల పెంపుతో విసిగిపోయిన ప్రజలు.. ప్రత్యామ్నాయ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పీఎం అవుతారని భారత బిగ్ బుల్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా వ్యాఖ్యానించారు.
priyanka gandhi
 
ఓ ఇంటర్వ్యూలో ఝన్‌ఝన్‌వాలా మాట్లాడుతూ.. విపక్షాలకు ఏ విధమైన అజెండా లేకుండా పోయిందని ఆరోపించారు. కేవలం నరేంద్ర మోదీని ఓడించడమే అజెండాగా వారు సాగుతున్నారని, ఈ క్రమంలో విజయం సాధించలేరని జోస్యం చెప్పారు. బీజేపీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయన్న విషయాన్ని మాత్రం తాను చెప్పలేనని, కానీ మోదీ మళ్లీ ప్రధాని అయ్యేది మాత్రం ఖాయమని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు అనారోగ్య కారణాలతో ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఒక్కరే పార్టీని నడుటం కష్టం. అందుకే వచ్చే ఎన్నికల్లో తన సోదరి ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలోకి దించేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారట. 
 
2019 ఎన్నికల్లో రాయ్ బరేలీ లేదా వారణాసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ప్రియాంకాగాంధీ అనుకుంటున్నారని తెలిసింది. రాయ్‌బరేలీ కంటే వారణాసి వైపే ప్రియాంక మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మోడీని ఓడించి… తన రాజకీయ ఆరంగేట్రాన్ని ఓ రేంజ్‌లో చాటాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీ నేతలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ నడిపించలేకపోతున్నారని పార్టీలో గుసగుసలు పెరిగాయి. ప్రియాంక వస్తే వ్యూహాలు మారతాయని, రాహుల్ కంటే కూడా ఆమె వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే వీలుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్టీ నేతల అభీష్టం మేరకు ప్రియాంక గాంధీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
వారణాసి మోదీ ప్రియాంకా గాంధీ Peacemaker Varanasi Bjp Rahul Gandhi Sonia Gandhi Priyanka Gandhi Congress Working Committee

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేసిన డాక్టర్.. డబ్బులిస్తే రాయిని తొలగిస్తానని?

వైద్య వృత్తికే ఆ వైద్యుడు కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే ...

news

కార్లలా భార్యలను మార్చే పవన్ అన్న జగన్ వ్యాఖ్యపై పవన్ కళ్యాణ్ పంచ్

కార్లు మార్చినంత ఈజీగా భార్యలను మార్చేస్తాడు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి భార్యను మార్చేయడం ...

news

ఆ విషయం పవన్ పెళ్లాలే తేల్చుకుంటారు.. జగన్‌కు ఎందుకు?: ఉండవల్లి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ...

news

మోదీని హగ్ చేసుకున్న రాహుల్: 3 నెలల ప్లానట.. యోగి సవాల్.. అవి పిల్లచేష్టలు?

వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తెలుగుదేశం పార్టీ ...

Widgets Magazine