శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (12:45 IST)

బలపరీక్షలో నెగ్గారు కానీ.. ముఖ్యమంత్రి పళని స్వామికి దినదినగండమే...

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధానంగా అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన ఆధిపత్య పోరు.. ఆ పార్టీ రెండుగా చీలిపోయేందుకు దారితీసింది. అయితే, కొత్త ముఖ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధానంగా అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన ఆధిపత్య పోరు.. ఆ పార్టీ రెండుగా చీలిపోయేందుకు దారితీసింది. అయితే, కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడప్పాడి కె.పళనిస్వామి సర్కారు శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గింది. 
 
ప్రజాస్వామ్యబద్దం కానీ, కాకపోనీ పళని స్వామి మాత్రం 122 ఓట్లతో బల పరీక్ష నెగ్గారు. పన్నీర్‌కు మద్దతిస్తున్న 11 మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి బయటికొచ్చేశారు. డీఎంకే సభ్యులు తమకు అవమానం జరిగిందంటూ గవర్నర్‌‌కు ఫిర్యాదు చేశారు. 
 
పళని స్వామి ప్రభుత్వమైతే ఎమ్మెల్యేల మద్దతుతో బల పరీక్షను నెగ్గింది. కానీ ప్రభుత్వ స్థిరత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పళని ప్రభుత్వం నిలబడుతుందా లేదా అన్నది సందేహమే. సీఎం ఎన్నిక స్పీకర్ లెక్క ప్రకారం చెల్లినా, ప్రజాస్వామ్యయుతంగా చూస్తే ఆ ఎన్నిక ఎంత మాత్రం చెల్లదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
234 మంది ఉన్న అసెంబ్లీలో 122 మంది ఎమ్మెల్యేలు పళనికి మద్దతు తెలిపారు అయితే విశ్వాస తీర్మానానికి సంబంధించి జరిగే ఓటింగ్ ప్రక్రియలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు. అది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శశికళ ప్రతిపాదించిన పళని స్వామి లొసుగులను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యిండొచ్చు కానీ ప్రజల విశ్వాసాన్ని పొందినప్పుడే ఆయన బలపరీక్షలో నెగ్గినట్టని వారు వాదిస్తున్నారు. 
 
అవినీతి కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న శశికళపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని, జయలలిత చనిపోవడానికి కూడా శశికళే కారణమని మెజార్టీ తమిళ ప్రజలు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి శశికళ ప్రతిపాదించిన వ్యక్తిగా సీఎం పీఠమెక్కిన పళనిస్వామి ఆమె ఆదేశాలను పాటిస్తే ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడపగలిగే అవకాశమే లేదని వారు అభిప్రాయపడుతున్నారు.