శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: సోమవారం, 19 సెప్టెంబరు 2016 (10:33 IST)

సింధుకు మూడు కోట్లు ఇచ్చారు స‌రే... విజయవాడ స్టేడియం గుల్లగుల్ల చేసేశారు...

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌కు క్రీడా సంస్కృతిని తానే పరిచయం చేసానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో విజయవాడలో ఇందిరాగాంధి మునిసిపల్ స్టేడియం ఓ హెలిప్యాడుగా మారిపోవడం బాధాకరమే కదా. అంతర్జాతీయ వన్ డే క్రికెట్ మ్యాచ్‌లకు అనేక క్రీడా సంబరాలకు వే

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌కు క్రీడా సంస్కృతిని తానే పరిచయం చేసానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో విజయవాడలో ఇందిరాగాంధి మునిసిపల్ స్టేడియం ఓ హెలిప్యాడుగా మారిపోవడం బాధాకరమే కదా. అంతర్జాతీయ వన్ డే క్రికెట్  మ్యాచ్‌లకు అనేక క్రీడా సంబరాలకు వేదికగా నిలిచిన స్టేడియం నేడు హెలిప్యాడ్‌గా మారిపోయింది. పీడబ్ల్యూ గ్రౌండ్స్ అమ్మేసిన నేపధ్యంలో అనేక ప్రైవేట్ , ప్రభుత్వ కార్యక్రామాలకు కుడా అదే వేదికయ్యింది. ఆ స్టేడియం తప్ప మరో అనువైన ప్రాంతం ప్రభుత్వానికి దొరకలేదట. దాంతో ఈ స్టేడియంలో ఏర్పాటు చేయతలపెట్టిన 400 మీటర్ల నిడివి గలిగిన ఏతల్టిక్ సింథటిక్ ట్రాక్‌ను విశాఖపట్టణంకు తరలించ‌నున్నట్టు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఎల వీ సుబ్రమణ్యం ప్రకటించారు.
 
ఈ ట్రాక్‌ ఏర్పాటుకు విశాఖపట్టణం మధ్యలో ఎక్కడా అనువైన ప్రదేశం దొరకలేదట. భీమునిపట్టణంలో గాని, వైజాగ్ స్టీల్ సిటీలో గాని, ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నారు. క్రీడాకారులకు అత్యంత అనువుగా విజయవాడ మధ్యలో ఉన్న ఐజీఎంసీఎస్‌ని కాదని ఎక్కడో భీమునిపట్టణం తరలించడం ప్రభుత్వ అవగాహ‌నా రాహిత్యాన్ని తెలియజేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. విజయవాడలో హెలిప్యాడ్ కోసం గతంలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌ను వినియోగించేవారు. అక్కడే అనేక సభలు, సమావేశాలు జరిగేవి. 
 
అయితే చంద్ర‌బాబు అధికారం లోనికి వచ్చిన వెంటనే స్వ‌రాజ్ మైదాన్ చైనా వాళ్ళ పరమైపోయింది. ఇక్క‌డ చైనా సిటీ స్క్వేర్ ఏర్పాటు చేయాల‌ని కాంట్రాక్టును కోట్ల రూపాయ‌ల‌కు ఇచ్చేశారు. ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినా బాబు మాట వినరు గదా! ఇప్పుడు హెలిప్యాడ్‌కు స్థలం దొరకకపోవడంతో క్రీడా వేదికపై ప్రభుత్వ దృష్టి పడింది. అంతే 2018 వరకు క్రీడలకు స్టేడియం దూరం. ఇదే మన ఘనత వహించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానం. 
 
హెలిప్యాడ్ కోసం క్రిడాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే సింథటిక్ టర్ఫ్‌ను వైజాగ్ తర‌లించేస్తున్నారు. అమరావతికి ఒలింపిక్స్ తెస్తారో లేదో తెలియదు గాని... విజయవాడ నుండి వైజాగ్‌కు టర్ఫ్ తరిలిపోయింది. ఇక ఒలంపిక్స్‌లో సింధుకు ర‌జ‌తం వ‌చ్చింద‌ని 3 కోట్ల రూపాయ‌లు క‌ట్ట‌బెట్ట‌డం అంతా షోనే అనే వ్యాఖ్యలు విజయవాడలో వినిపిస్తున్నాయి.