శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Updated : గురువారం, 28 జులై 2016 (13:15 IST)

నేడు వరల్డ్ హెపటైటిస్ డే... కాలేయంలో కలవరం...

ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రోజు ఆ వ్యాధిని కనుగొన్న డాక్టర్ బారుచ్ శ్యామ్యూల్ బ్లంబర్గ్ జన్మదినం. ప్రపంచ జనాభాలో ప్రతి 12 మందిలో ఒక

ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రోజు ఆ వ్యాధిని కనుగొన్న డాక్టర్ బారుచ్ శ్యామ్యూల్ బ్లంబర్గ్ జన్మదినం.  ప్రపంచ జనాభాలో ప్రతి 12 మందిలో ఒకరు హెపటైటిస్ బారిన పడుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది హెపటైటిస్ బి, సి వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఏటా 14 లక్షల 50 వేల మంది మరణిస్తున్నారు. మన దేశ జనాభాలో రెండు శాతం మంది హెపటైటిస్ బి, మూడు శాతం మంది హెపటైటిస్ సితో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
సమాజంలో చాలామంది కలుషిత ఆహారం, కలుషిత నీరు ద్వారా హెపటైటిస్ వ్యాధుల బారిన పడుతున్నారు. హెపటైటిస్ వైరల్ వ్యాధి. ఇందులో 5 రకాలు ఉన్నాయి. హెపటైటిస్ - ఎ,బి,సి,డి, ఇ. మన ప్రాంతంలో హెపటైటిస్ ఎ,బి,సి ఎక్కువగా ఉన్నాయి. కలుషిత నీటి ద్వారా, ఆహారం ద్వారా వ్యాపించే హెపటైటిస్ సులభంగా తగ్గిపోతుంది. దీనిని కామెర్లుగా పిలుస్తారు. ఈ వ్యాధి కారణంగా కాలేయ పనితీరు, తాత్కాకలింగా తగ్గుతుంది.
 
హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మాత్రమే లివర్ క్యాన్సర్‌కు దారితీస్తాయి. హెపటైటిస్ ఎ వల్ల లివర్ కేన్సర్ సోకే అవకాశం ఉంది. కలిషితమైన నీరు, ఆహారం వల్ల హెపటైటిస్ ఎ సోకుతుంది. రక్తం, ఇతర శరీర స్రావాలు, మ్యూకస్ ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్ బి సోకుతుంది. హెపటైటిస్ బి సోకిన వారిలో 90 శాతానికి పైగా చిన్నారులే. ఈ వైరస్ సోకిన తల్లుల నుంచి వారికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్ బి సోకే అవకాశాలు ఉన్నా, అవి చాలా అరుదు. హెపటైటిస్ బి సోకిన వారిలో 25 శాతం మందికి మాత్రమే సిర్రోసిస్ లేదా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెచ్ఐవీ సోకిన వారికి హెపటైటిస్ సి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
కొన్ని నివారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ సోకకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లను క్రిములకు దూరంగా ఉంచుకోవాలి. టూత్ బ్రష్‌లు, రేజర్లు ఒకరివి మరొకరు వాడరాదు. ఆస్పత్రులలో డిస్పోజబుల్ సిరంజీలు, సూదులు వాడాలి. వ్యాధి సోకిన వారు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. కలుషితమైన ఆహారానికి, నీటికి దూరంగా ఉండాలి. హెపటైటిస్ పైన అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది “హెపటైటిస్‌ను నివారించండి. అది మీ చేతుల్లోనే ఉంది” నినాదంతో ప్రచారం చేపడుతుంది.