Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆధ్యాత్మిక పర్యటనలో జనసేనాని.. ఎందుకో తెలుసా? (Video)

సోమవారం, 14 మే 2018 (21:47 IST)

Widgets Magazine

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బిజీబిజీగా గడుపుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు ప్రశాంతత కోరుకున్నట్లున్నారు. ప్రజల మధ్య ఎప్పుడూ తిరుగుతూ ప్రత్యేక హోదా ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన పవన్ కళ్యాణ్‌ గత రెండురోజుల నుంచి తిరుమల గిరులలోనే సేదతీరుతున్నారు. అది కూడా సామాన్య భక్తుడిలాగా మఠంలో. సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరైన జనసేనాని అత్యంత సామాన్యుడిలా తిరుమలలో గడపడం.. అందులోను ప్రశాంతత కోరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
pawan kalyan
 
ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించేందుకు సిద్థమయ్యాడు పవన్ కళ్యాణ్‌. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్‌ తెలిపారు. అయితే బస్సు యాత్రకు రెండురోజుల ముందు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు పవన్. పి.కె.టూర్ అసలు తిరుపతిలో ఉంటుందని ఆ పార్టీ క్యాడర్‌కే తెలియదు. ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్‌ తిరుపతిలో ప్రత్యక్షమై ఒక మఠంలో సేద తీరుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమ కాకుండా ఆంజనేయస్వామి పుట్టినట్లుగా ఆధారాలు ఉన్న జపాలీ తీర్థంను సందర్సించారు పవన్ కళ్యాణ్‌. తన గదిలోనే యోగా చేసుకుంటూ ప్రశాంతంగా ఒక్కరే గడుపుతున్నారు పవన్.
 
అభిమానులెవరితోను ఇప్పుడు మాట్లాడడం లేదట. స్వామివారి దర్శనం తరువాత కూడా ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు. తనకు అన్నప్రాసన, నామకరణం చేసింది తిరుమలలోని యోగ నరసింహస్వామి ఆలయం నుంచి అనీ, అందుకే తిరుమలకు వచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్‌. అనుకున్న సమయం కన్నా ఆలస్యంగానే పవన్ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ప్రారంభిస్తే మూడు, నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. అందుకే ఇప్పుడే ప్రశాంతత కోసం పవన్ కళ్యాణ్‌ ఆధ్యాత్మిక క్షేత్రాలను తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వీడియో చూడండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tirumala Long Trip Pawan Kalyan

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీరు బీటెక్, ఎంసీఏ పూర్తి చేశారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?

మీరు బీటెక్, ఎంసీఏ పూర్తి చేశారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? మీ చదువుతోపాటు ...

news

చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చాడు.. ఐదేళ్ళ చిన్నారిని రెండునెలలు అనుభవించాడు..

చిత్తూరు జిల్లాలో మరో దాచేపల్లి సంఘటన జరిగింది. ఐదేళ్ళ చిన్నారిపై రెండునెలల పాటు ...

news

జగన్ మోహన్ రెడ్డి 2000 కి.మీ పాదయాత్ర, తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవి పాదయాత్ర

రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయటం కోసం పాదయాత్ర ...

news

శ్రీవారి చెంత నుంచి శెట్టిపల్లి గ్రామానికి పవన్ కళ్యాణ్.. ఎందుకు?

పవన్ తన పవర్ పాలిటిక్స్‌ను మొదలుపెట్టారా. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి ...

Widgets Magazine