శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 14 మే 2018 (12:06 IST)

కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లిని ముట్టుకుంటే?

కంచిలోని బంగారు బల్లి గురించి వినే వుంటారు. బంగారు బల్లిని తాకితే బల్లి దోషాలు వుండవంటారు. అయితే బంగారు బల్లులు నిజంగానే వుంటాయా అనే అనుమానం అనేక మందికి వుంటుంది. అయితే బంగారు బల్లులు వుండేవని అవి కాల

కంచిలోని బంగారు బల్లి గురించి వినే వుంటారు. బంగారు బల్లిని తాకితే బల్లి దోషాలు వుండవంటారు. అయితే బంగారు బల్లులు నిజంగానే వుంటాయా అనే అనుమానం అనేక మందికి వుంటుంది. అయితే బంగారు బల్లులు వుండేవని అవి కాలక్రమేణ అంతరించి పోయాయట. ఇటీవల శ్రీవారి సన్నిధిలో ఓ బంగారు బల్లి దర్శనమిచ్చింది. 
 
ఇప్పటివరకూ తిరుమల కొండల్లో అందరూ అంతరించిపోయినట్లుగా భావిస్తున్న బంగారు బల్లి జాడ వెలుగుచూసింది. శ్రీవారి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో.. అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే మోకాళ్ల పర్వతం వద్ద మూడు వేల 150 మెట్టు కొండల్లో ఆదివారం (మే-13)వ తేదీ రాత్రి బంగారు బల్లి కనిపించింది. దీన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. 
 
ఇదిలా ఉంటే.. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తుంటే.. రాహుగ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇక బంగారు, వెండి బల్లికి సంబంధించిన పురాణగాథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులుండేవారని.. వీరిద్దరూ నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. 
 
శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో ముక్తి లభిస్తుందని శాప విముక్తినిస్తాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. ఇలా కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. 
 
ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. అందుకే బల్లిదోషాలు కంచి ఆలయంలోని బల్లుల్ని తాకితే నివృత్తి అవుతాయని పండితులు చెప్తున్నారు.