శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 5 మే 2015 (20:24 IST)

ఒబామాను కలవడానికి ఓ రేటుందా..? చినబాబు అలాగే కలుస్తున్నారా... ఖర్చెంత.?

చంద్రబాబు ఏమి చేసినా దాని వెనుక అసలు రహస్యం మరేదో ఉంటుంది. తండ్రిని మించిన తనయుడు లోకేష్ బాబు. తన తండ్రికే దక్కని ఒబామా అపాయింట్మెంటును ఎలా సాధించేస్తున్నారని జనం, మీడియా ముక్కన వేలేసుకుంది. కానీ ఒబామా అపాయింటుమెంటును కొనడానికి ఓ సమయం.. సందర్భం.. దానికో రేటు ఉందని ఎంతమందికి తెలుసు..? సరిగ్గా అదే కీలక అంశంగా నడుచుకుంటున్నాడు ఆంధ్రా చినబాబు. ఒబామా అపాయింటుమెంటును కొనేస్తున్నారు.
 
చినబాబుకు ఏ హోదా లేకపోయినా చంద్రబాబు అధికార హోదాలో అమెరికాకు పంపించేశారు. అయితే అక్కడే చదివిన చినబాబుకు ఒబామా అపాయింటుమెంటును ఎలా సాధించుకోవాలో(కొనాలో) చాలా స్పష్టంగా తెలుసు. రాజకీయాలలో తండ్రి చాటున పాఠాలు నేర్చుకుంటున్న చినబాబు ఒబామాను కలిశాండంటే అదోపెద్ద చర్చ అవుతుంది. ఎలా కలిశారు.? ఏం మాట్లాడారు? అనేవి వారు ఏం చెబితే అవి జనం వినాలి. ఇంతకీ ఒబామాను కలవడం అంత సులభమా.. అంటే దానికి ఓ మార్గం ఉంది. ఓ రేటుంది. ఈ విషయం ఎంత మందికి తెలుసు చెప్పండి. 
 
డెమోక్రటిక్ పార్టీ, వైట్ హౌస్ విక్టరీ పండ్ పేరిట...  ప్రతి ఏడాది ఒబామా నిధుల సేకరణ కార్యక్రమం అమెరికాలోని ఫోర్ట్ ల్యాండ్ లోని సెంటినల్ హోటళ్లో ఏర్పాటు చేస్తారు. ఇది సరిగ్గా ఫండ్ సేకరించే సమయం.  ఒబామా కార్యక్రం విషయానికి వస్తే.. రేట్ల పట్టిక ఇలా ఉంటుంది. 
1.    ప్రవేశానికి $500 డాలర్లు 
2.    $5000 లకి ఓబామాతో ఫోటో
3.    $10000లకి కలిసి మీట్ అండ్ గ్రీట్ ఫోటో
 
ఆంధ్రప్రదేశ్ చిన బాబుకు ఈ సమయం సందర్భం చాలా బాగా తెలుసు. ఇంకేముంది. ఈ లెక్కన పదివేల డాలర్లు అమెరికాలోని ఒబామా పార్టీకి  కట్టి ఆయనతో ఫోటో దిగడానికి రేడి అయ్యాడు. ఇక ఆ ఫోటోను చూపించి అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయాల్లోకి రాకముందే మార్కులు కొట్టేయవచ్చు. ఇలా కేవలం లోకేష్ మాత్రమే కాదు.. డబ్బు కట్టే తాహతు ఉన్నవారు ఎవరైనా ఒబామాతో మీట్ కావొచ్చు.. ఫోటోలు దిగొచ్చు. అమెరికాలోని అబ్బాయిలు ఈ విషయం చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు.