Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ 'హోదా' ఎఫెక్ట్ కర్నాటకలో రిఫ్లెక్ట్ కాబోతుందా? భాజపాపై తెలుగువారు...?

సోమవారం, 26 మార్చి 2018 (20:36 IST)

Widgets Magazine
Karnataka

కర్నాటక రాష్ట్రంలోని 30 జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో తెలుగువారి ప్రభావం విపరీతం అని చెప్తుంటారు. పైగా ఈ జిల్లాలన్నీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుగా వున్నవే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించిన నరేంద్ర మోదీ సర్కారుపై తెలుగువారు గుర్రుగా వున్నారు. భాజపా పేరు చెబితే కస్సుమంటున్నారు. భాజపా పట్ల వున్న వ్యతిరేకత దృష్ట్యా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఆ పార్టీతో తెగతెంపులు చేసేసుకుంది. ఇదిలావుంటే ఇప్పుడు తెలుగువారి ప్రభావం కర్నాటక రాష్ట్రంలోనూ కనబడుతోందన్న దానికి నిదర్శనంగా ఆ రాష్ట్రంలో తాజాగా చేపట్టిన సర్వే ఒకటి తేటతెల్లం చేసింది. 
 
అదేంటయా అంటే కర్ణాటక తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గుప్పిట్లోకే రాబోతుందట. గద్దెనెక్కాలని భావిస్తున్న కమలనాథులకు ఈ వార్త పెద్ద షాకే. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి 126 సీట్లు వస్తాయని సీ-ఫోర్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం అమాంతం పెరిగిపోతోందట. ఈ సంస్థ తాజాగా మార్చి 1 నుంచి 25 వరకు ఓ సర్వే నిర్వహించింది. సుమారు 154 నియోజకవర్గాల్లో 22,357మంది ఓటర్ల వద్ద ఆరా తీస్తూ 2,368 పోలింగ్‌ బూత్‌ పరిధి ప్రాంతాలను కూడా కవర్‌ చేశారు. 
 
326 పట్ణణ ప్రాంతాల్లో, 977 గ్రామీణ ప్రాంతాలలో చేసిన సర్వేలో భాజపాకు షాక్ తగిలే ఫలితాలు వచ్చాయట. బీజేపీకి 70 సీట్లు మాత్రమే వస్తాయనీ, గతంతో పోలిస్తే 30 సీట్లు అదనం అని వెల్లడించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పుకుంటున్న జేడీఎస్‌ కర్ణాటకలో గతంలో కంటే దారుణంగా దెబ్బతింటుందట. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా వుంటుందో తేలాల్సి వుంది. ఇకపోతే 2013లో కూడా సీ ఫోర్‌ చేసిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీకి 119 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పగా ఆ పార్టీ 122 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు వెల్లడించిన సర్వే కూడా అలాగే వాస్తవమైతే కమలనాథుల కలలు కల్లలయినట్లే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్ గందరగోళం సృష్టిస్తున్నారు... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడకొట్టి రెండు రాష్ట్రాలకు కొన్ని ...

news

బీజేపీతో టీడీపీ రాజీ పడింది.. జేడీ లక్ష్మీ నారాయణ వస్తే ఆహ్వానిస్తాం: పవన్

తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కల్యాణ్ కాస్త దూరమైనట్లే కనిపిస్తోంది. జనసేన పార్టీ ...

news

తప్పుడు వార్తలు రాశారో.. పదేళ్ల జైలు శిక్ష తప్పదండోయ్..

మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ...

news

బీజింగ్‌లో వింత కోతి.. హావభావాలన్నీ అచ్చం మనిషిలా (వీడియో)

వానరుల నుంచి మానవుడు పుట్టాడని చెప్తుంటారు. తాజాగా మనిషి ముఖ ఆకారంతో కూడిన ఓ వింత కోతి ...

Widgets Magazine