శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : బుధవారం, 31 డిశెంబరు 2014 (17:14 IST)

ఆపిల్, వెనిగర్‌తో శిరోజాల సౌందర్యం!

ఆపిల్, సైడర్ వెనిగర్‌తో శిరోజాల సౌందర్యం పొందాలంటే.. జుట్టుకు ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా గ్రేట్‌గా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కండీషనర్‌గా అప్లై చేయడం వల్ల స్లాప్ పిహెచ్ లెవల్స్‌ను సమతుల్యం చేసి తలలో డ్రైనెస్, దురదను నివారిస్తుంది. అంతే కాదు, తలలో బ్యాక్టీరియా, పంగల్ ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. చుండ్రుకు దారితీసే బ్యాక్టీరియాను నివారించి ఫోలీసెల్స్‌కు రక్షణ కల్పిస్తుంది 
 
ఎలా ఉపయోగించాలంటే.. 
మొదట జుట్టును మంచినీళ్ళతో స్నానం చేసి తర్వాత తడి ఆరనివ్వాలి. తర్వాత ఒక స్ప్రే బాటిల్లో ఆపిల్ సైడర్ వెనిగర్, నీరు సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. కాటన్ బాల్స్ ఉపయోగించి తలలో చర్మానికి అప్లై చేయాలి. కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ హో రెమెడీనీ దినం మార్చి దినం చేయడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుందని హెయిర్ కేర్ నిపుణులు అంటున్నారు.