గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:57 IST)

ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోవడం ఎలా..?

సాధారణంగా చాలామంది స్త్రీలు ఎప్పుడు చూసినా బ్యూటీ పార్లల్లోనే ఉంటారు. సమయానికి తింటున్నారో లేదో కానీ.. పార్లకు మాత్రం తప్పకుండా వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే.. చేతి వేళ్లు, గోళ్లు, చేతులకు మానిక్యూర్ చేయించుకోవడానికి.. ఆ అవసరం లేదంటున్నారు. ఇంట్లోనే మానిక్యూర్ ఎలా చేయాలో తెలుసుకుందాం..
 
కావలసినవి..
పొద్దు తిరుగుడు, ఆముదం నూనెల మిశ్రమం
కొద్దిగా బాదం నూనె
విటమిన్ ఇ, ఆలివ్ నూనెలు
టీ ట్రీ నూనె
విటమిన్ ఇ క్యాప్యూల్స్
 
ఎలా చేయాలి:
1. ముందుగా పైన చెప్పిన అన్ని పదార్థాలను కలిపి మైక్రోవేవ్‌లో 30 సెకన్లు వేడిచేయాలి. నూనె మరీ వేడెక్కకుండా జాగ్రత్తపడాలి. విటమిన్ ఇ క్యాప్యూల్స్‌ను విప్పి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి.
 
2. ఈ మిశ్రమంలో గోళ్లు ముంచి నూనె చల్లారే వరకు అలానే ఉంచాలి. తరువాత 10 సెకన్లు నూనె వేడిచేసి మళ్లీ గోళ్లను ముంచాలి. ఆపై కొద్దిగా నూనె తీసుకుని చేతులు, మణికట్టుకు రాసుకుని సున్నితంగా చేతులు మొత్తం మర్దనా చేసి నీళ్లతో కడిగేయాలి.
 
3. ఆ తరువాత గోళ్లను శుభ్రమైన తుడుచుకోవాలి. నిద్రపోయే ముందు వారానికి రెండుసార్లు ఈ మానిక్యూర్ చేస్తే ఫలితం ఉంటుంది. మానిక్యూర్ పూర్తయ్యాక చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి.