శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Selvi
Last Updated : శనివారం, 7 మార్చి 2015 (18:32 IST)

మహిళా దినోత్సవం: ఎలాంటి రంగులు వాడాలి.. బ్లాక్ మాత్రం?!

మహిళా దినోత్సవం రోజున మీ సతీమణికి, మీ సోదరికి ఎలాంటి రంగు దుస్తులు కొనిపెట్టాలి అనే సందేహంలోనే ఉన్నారా..? అయితే ఈ స్టోరీ చదవండి.

వుమెన్స్ డే రోజున సర్ ప్రైజ్‌ ఇచ్చేందుకు ఎరుపు, తెలుపు, పసుపు, బబుల్ గమ్ పింక్ వంటి రంగులను ఎంచుకోవచ్చు. అయితే నలుపు రంగు దుస్తులు మాత్రం ఎంచుకోవద్దు. ఇది దుఃఖానికి సంకేతం కాబట్టి ఈ రంగును దూరంగా వుంచడం ఎంతో మంచిది. 
 
పింక్ లేదా షేడెడ్ పింక్ కలర్స్ వుమెన్స్ డేకు ఎంచుకోవచ్చు. పింక్ లేదా పసుపు రంగును వుమెన్స్ డే రోజున ధరించడం ద్వారా మహిళలు రాణిస్తారని మానసిక నిపుణులు అంటున్నారు.

అలాగే ఎరుపు రంగు టాప్, చీరలు, కుర్తాలు వుమెన్స్ డే రోజున ధరించవచ్చు. అక్వా బ్లూ రంగు కూడా వుమెన్స్ డే రోజున మిమ్మల్ని స్పెషల్‌గా చూపెడుతుంది. ఇదే విధంగా ఆరెంజ్, ముత్యపు తెలుపు రంగు దుస్తులు వాడటం ద్వారా అందంగా కనిపిస్తారు. అలాగే రాయల్ బ్లూ.. పీచ్, లైట్ పర్పుల్ రంగులు కూడా వాడటం ద్వారా స్పెషల్‌గా కనిపిస్తారు.