శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (12:53 IST)

ఆఫీసుకు వెళుతున్నారా..?

సాధారణంగా ఉద్యోగాలకు వెళ్ళే అమ్మాయిలందరూ చుడిదార్స్, షర్టు, ప్యాంట్‌లను ధరిస్తున్నారు. వర్కింగ్ రోజుల్లో కాకుండా వారం చివరి రోజుల్లోను, పార్టీలు, సినిమాలు, షికార్లకు వెళ్లే సమయాల్లో జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్ అనువుగా ఉన్నాయని వాటిని ధరిస్తున్నారు.

నానాటికి పెరుగుతున్న నాగరికతకు అనుగుణంగాను, నేటి ఆధునిక యుగానికి తగ్గట్టు వస్త్రధారణ చేసుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. మన ఫ్యాషన్‌కు తగ్గట్టు మార్చుకోవాలంటే సమాజంలో ఉండే స్టైల్‌ను, ప్రస్తుత ట్రెండ్‌ను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. 
 
పార్టీకి ఎక్కడికైనా వెళ్లినప్పుడు బాటమ్‌లో సింథటిక్ వస్త్రాల డిజైన్స్‌తో చేయబడిన జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ ప్యాంట్‌పై వేసుకునే టాప్స్‌‌కు బార్డర్‌ కూడా మంచి డీజైన్‌ ఉండే విధంగా ఎంపిక చేసుకోవాలి. అప్పుడే చూడ ముచ్చటగా ఉంటుంది.
 
ప్రతిరోజూ మీరూ జీన్స్ ప్యాంట్ వేసుకునే అలవాటు ఉన్నవారైతే.. ఒకసారి మీ జీన్స్ ప్యాంట్‌ను మోకాలి కింద నుంచి కాస్త వదులుగాను పై భాగాన్ని చాలా టైట్‌గా కాకుండా శరీరాకృతికి తగ్గట్టు సరైన క్రమంలో కుట్టించి ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది.