శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (14:58 IST)

బ్రొకోలి ఆమ్లెట్ తయారీ విధానం....

బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్రొకోలిలో విటమిన్ బి5, సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియ

బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. బ్రొకోలీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్రొకోలి విటమిన్ బి5, సి, ఇ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, శక్తివంతమైన న్యూట్రీషియన్స్‌ను కలిగి ఉంటుంది. బ్రొకోలీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. ఇటువంటి బ్రొకోలీతో ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
సన్నగా తరిగిన బ్రొకోలి - 100 గ్రా 
గుడ్లు - 4 
ఉల్లి తరుగు - అరకప్పు 
అల్లం, వెల్లుల్లి తరుగు - 1 స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా 
కొత్తిమీర తరుగు - అర కప్పు 
మిరియాలపొడి - 1/2 స్పూన్ 
పచ్చిమిర్చి తరుగు - 1/2 స్పూన్ 
పాలు - పావు కప్పు 
నూనె లేదా వెన్న - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో పైన తెలిపిన పదార్థాలన్నింటిని వేసుకుని గుడ్లసొన కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై నూనె లేదా వెన్నను వేసి గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్లుగా పోసుకుని రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. అంతే బ్రోకోలి ఆమ్లెట్ రెడీ.