గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : బుధవారం, 4 జులై 2018 (15:43 IST)

రోడ్లపై దొరికే దహీ పూరీ ఎందుకు? ఇంట్లోనే తయారుచేసుకుంటే?

దహీపూరీ ఛాట్ రెసిపీని చాలామంది ఇష్టపడుతుంటారు. దహీ పూరీ ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇది రోడ్ సైడ్ స్నాక్ రెసిపిని తినడం కంటే దీనిని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా రోజంతా అలసిపోయినప్పుడు వెంటనే రిలాక్స్‌గా ఉండాలంటే చల్లగా ఉండే దహీ ప

దహీపూరీ ఛాట్ రెసిపీని చాలామంది ఇష్టపడుతుంటారు. దహీ పూరీ ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇది రోడ్ సైడ్ స్నాక్ రెసిపిని తినడం కంటే దీనిని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా రోజంతా అలసిపోయినప్పుడు వెంటనే రిలాక్స్‌గా ఉండాలంటే చల్లగా ఉండే దహీ పూరీ చాలా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
అలుగడ్డలు - 2 
శెనగలు, పెసలు - అరకప్పు
కొత్తిమీర - అరకప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1/2 స్పూన్
కారం - 1/2 స్పూన్
ఉప్పు - తగినంత
స్వీట్ చట్నీ - 2 స్పూన్స్
గ్రీన్ చట్నీ - అరకప్పు
పెరుగు - 1 కప్పు
 
తయారీ విధానం: 
ముందుగా ఆలుగడ్డలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో శెనగలు, పెసలు, కొత్తిమీర కలిపి ఒక గంట నానబెట్టుకున్న తరువాత ఆ మిశ్రమాన్ని బాగా ఉడించుకోవాలి. ఆ ఉడికించిన మిశ్రమంలోని నీటిని వంపి బాణలిలో వేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన ఆలుగడ్డలు వేసి కలుపుకుని పూరీలో పెట్టుకోవాలి. ఇలా చేసిన పూరీలలో కాస్త స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, పెరుగు వేసుకుని తింటే దహీ పూరీ రెడీ.