శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:22 IST)

బ్రెడ్ టోస్ట్.. ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 4
గుడ్లు - 2
ఉల్లిపాయ - 1
మిర్చి - 2
కొత్తిమీర - పావుకప్పు
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
నెయ్యి - 2 స్పూన్స్
పన్నీర్ - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం అన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో గుడ్లు పగలగొట్టి బీట్ చేయాలి. చివరగా క్యారెట్, పన్నీర్ వేసి కలపాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్‌నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి జాగ్రత్తగా పెనంపై పెట్టాలి. ఆపై కొద్దిగా నెయ్యి వేసి రెండువైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించి సర్వ్ చేసుకోవాలి. అంతే... బ్రెడ్ టోస్ట్ రెడీ.