మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (13:22 IST)

ఆరెంజ్ పుడ్డింగ్ చేయడం ఎలా...?

కావలసిన పదార్థాలు:
వెన్న - 200 గ్రా
పంచదార - 1 కప్పు
ఆరెంజ్ తొక్కల పొడి - 2 స్పూన్స్
గుడ్లు - 3
మైదా - ఒకటిన్నర కప్పు
పాలు - అరకప్పు
ఆరెంజ్ జ్యూస్ - పావుకప్పు 
కమలాలు - 2
 
తయారీ విధానం:
ముందుగా వెన్న, ముప్పావుకప్పు పంచదార పొడి, కమలా తొక్కలపొడి వేసి గిలకొట్టాలి. ఆ తరువాత గుడ్డుసొన ఒకదాని తరువాత ఒకటి వేసిబీట్ చేయాలి. మైదాపిండి కూడా వేసి గిలకొట్టి పాలు పోసి కలపాలి. పుడ్డింగ్ వండే గిన్నెలో అడుగున బేకింగ్ పేపర్ పరిచి, నెమ్మదిగా పుడ్డింగ్ మిశ్రమాన్ని పోసి వెడల్పాటి పాన్‌లో పెట్టి మూతపెట్టాలి. పుడ్డింగి గిన్నె సగం మునిగే వరకు పాన్‌లో వేడినీళ్లు పోసి మూతపెట్టి స్టవ్‌ మీద పెట్టాలి.
 
నీళ్లు మరిగాక సిమ్‌లో పెట్టి ఒకటిన్నర గంటపాటు ఉడికించాలి. ఓ గిన్నెలో మిగిలిన పంచదార, ఆరెంజ్ జ్యూస్ వేసి 2 నుండి 3 నిమిషాలు మరించి సిమ్‌లో 5 నిమిషాలు ఉంచి తీసి ఒలిచిన కమలా తొనలు వేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక 10 నిమిషాలు చల్లారనిచ్చి పుడ్డింగ్ బయటకు తీసి ప్లేటులో పెట్టి ఆరెంజ్ జ్యూస్ మిశ్రమం దానిమీదుగా పోసి వడ్డించాలి. అంతే ఆరెంజ్ పుడ్డింగ్ రెడీ.