Widgets Magazine

హనుమజ్జయంతి రోజున ఇలా పూజ చేస్తే..?

బుధవారం, 9 మే 2018 (18:14 IST)

హనుమాన్ జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి, కృష్ణ పక్షంలో జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన (గురువారం) హనుమజ్జయంతి వస్తోంది. ఈ రోజున యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆకు జరుగుతుంది.


భారీ సంఖ్యలో భక్తులు 41 రోజుల పాటు దీక్ష పాటించి స్వామిని దర్శించుకుంటారు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల్లో లక్ష పత్ర పూజ జరుపుతారు. ఈ పూజలో పాల్గొనే వారికి.. ముందుండి నిర్వహించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. 
 
అలాగే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంకా సమీపంలోని హనుమంతుని ఆలయాల్లో చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. 
 
పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. 
 
పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకములు, హనుమాన్‌చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
హనుమజ్జయంతి ఆకుపూజ హనుమాన్ పూజ జిల్లేడు వత్తులు నువ్వుల నూనె Hanumanjayanthi Vrataspujas Anjaneyaswamy Puja Vidhi Hanuman Jayanti Hanuman Vrat Pooja

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

#HanumanJayanthi రోజున ఏ చిత్ర పటాన్ని ఉపయోగించాలి? తమలపాకుల పూజతో?

హనుమజ్జయంతి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏంటో చూద్దాం.. హనుమంతుడు ఆరాధన చేయడం ద్వారా ...

news

హనుమజ్జయంతి.. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే?

కరీంనగర్ పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో వెలసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం చాల ...

news

హనుమజ్జయంతి ఎప్పుడు జరుపుకోవాలి? ఆంజనేయ స్తోత్రాలను స్తుతిస్తే?

హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ...

news

ఒక వైపు భార్యకు గులాము, మరొకవైపు డబ్బుకు గులాము...

కామినీ కాంచనాల నడుమ జీవిస్తుంటే యోగం ఎలా సిద్దిస్తుంది. వాటి నడుమ అనాసక్తుడై జీవించడం ...

Widgets Magazine