Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంక్రాంతి రోజున స్నానం చేయకుండా వుండకండి..

శనివారం, 13 జనవరి 2018 (13:58 IST)

Widgets Magazine

పుష్యమాసం, శుక్లపక్షంలో వచ్చే సంక్రాంతి నాడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సూర్యుడు ధనుర్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి. ఈ రోజును అత్యంత శుభదినంగా భావిస్తాం. శాస్త్రాల్లో సంక్రాంతి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడం ద్వారా పుణ్య ఫలితాలను పొందవచ్చు. సంక్రాంతి రోజున గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ నదుల్లో స్నానమాచరించే వారికి బ్రహ్మలోక ప్రాప్తి చేకూరుతుంది. 
 
నదీస్నానం చేయలేని వారు ఇంట్లోనే శుచిగా స్నానమాచరించవచ్చు. వీలైనంతవరకు మకర సంక్రాంతి నాడు చల్లని నీటితోనే స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేయని వారు నిరుపేదలుగా, అనారోగ్యాలతో బాధపడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. మకర సంక్రాంతి నాడు ఎవరైతే తీర్థస్నానం చేసి.. పిండ ప్రదానం చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే.. స్వర్గ వాసులు దానిని స్వీకరించి ఆశీర్వదిస్తారు. 
 
భోగి, సంక్రాంతి రోజున ఇంట్లోని స్వామి వారి ప్రతిమలకు పవిత్ర జలాలలో స్నానం చేయించాలి. ఈ రెండు రోజుల్లో స్నానం, దానం చేయాలి. మకర సంక్రాంతి నాడు అపమృత్య దోషానికి దుర్గాసప్తసతి పారాయణం చేయడం కానీ చేయించడం కానీ చేయాలి.
 
చేయకూడనవి:
ఈ పండుగ రోజున ఇతరులను దూషించకూడదు. కర్కసంగా మాట్లాడకూడదు. 
కోపంగా వ్యవహరించకూడదు. 
నిషిద్ధ పదార్థాలు తినకూడదు. 
మత్తు పదార్థాలకు దూరంగా వుండాలి.
గోమాతకు పచ్చి గ్రాసం తినిపించాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శివుని గుడిలో ఆ సమయంలో ఒక్క దీపం వెలిగిస్తే కుబేరులే...

కుబేరుడు డబ్బుకు, సంపదకు, సకల ఐశ్వర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఖచ్చితంగా ...

news

సంక్రాంతి పురుషుడు మీ ఇంటికొస్తున్నాడు...

సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినది మొదలు తులారాశివరకు ఒక కాలం... దీనినే దేవతలకు పగలు ...

news

దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు... సాయిబాబా సూక్తులు..

1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను. 2. గురువును సంపూర్ణంగా.. అంటే ...

news

శ్రీవారి భక్తులకు తీపికబురు... కోరినన్ని లడ్డూలు

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకూ రెండు ...

Widgets Magazine