శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (20:23 IST)

విమానాల మంటలు నుండి తప్పించుకున్న సౌదీ అరేబియా ఆటగాళ్లు...

రష్యాలో జరుగుతున్న ఫిఫా వల్డ్ కప్‌లో భాగంగా సౌదీ అరేబియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్నప్పుడు విమానంలోని ఓ ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు ఏర్పడ్డాయట. ఈ ప్రమాదం నుండి ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్షేమంగా బయటపడ్డారు. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు రాస్తోవ్‌కు వెళుతుండ

రష్యాలో జరుగుతున్న ఫిఫా వల్డ్ కప్‌లో భాగంగా సౌదీ అరేబియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్నప్పుడు విమానంలోని ఓ ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు ఏర్పడ్డాయట. ఈ ప్రమాదం నుండి ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్షేమంగా బయటపడ్డారు. ఉరుగ్వేతో మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు రాస్తోవ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
విమానం ప్రయాణిస్తుండగానే మంటలు వ్యాపించాయి. దీంతో సౌదీ అరేబియా ఆటగాళ్లు భయపడ్డారు. కానీ చివరకు విమానం సురక్షితంగా నేలపైకి ల్యాండ్ అయింది. ఇక ఆ విమానంలో ఉన్న అందరు త్వరత్వరగా దిగి ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపం వలనే ఇంజిన్‌లో ఈ మంటలు ఏర్పడ్డాయని తెలిపారు. విమానానికి పక్షి ఢీకొనడం వలనే మంటలు చెలరేగాయని రష్యా ఎయిర్ లైన్స్ తెలియజేసింది.