శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (14:06 IST)

యాపిల్, ఆప్రికాట్ జ్యూస్ బెనిఫిట్స్ ఏంటి?

యాపిల్స్‌తో పాటు ఆప్రికాట్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. 
 
విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి.
 
అలాగే ఆప్రికాట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా అధిక శాతం విటమిన్స్ ఎ, బి, సి మరియు కెలను పొందవచ్చు. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. అంతే కాకుండా ఎముకల బలానికి, చర్మ, కురుల సంరక్షణకు బాగా సహాయపడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.