శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 జులై 2014 (19:05 IST)

పరగడుపున నీళ్ళు తాగితే కలిగే మేలేంటో తెలుసా?

ప్రతిరోజూ ఉదయం పరకడుపున నీళ్ళు త్రాగడం వల్ల అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీటిలో మ్యాజికల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీరు భోజనం చేసిన ప్రతి సారి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, మీరు తీసుకొనే హై డైట్ ఫుడ్స్ సులువుగా జీర్ణమవుతాయి. మీకు అవసరం అనిపించినప్పుడుల్లా గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. 
 
ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ప్రతి రోజూ మనం పీల్చే గాలి,  మనం తీసుకొనే ఆహారం ద్వారా మన శరీరంలో చేరే వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి నీరు గ్రేట్‌గా సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం నిద్రలేవగానే నీరు త్రాగి, యూరినేట్ చేయడం ద్వారా మీ శరీరం తేలికవుతుంది. 
 
ప్రతి రోజూ ఉదయం తగినన్ని నీరు త్రాగుతూ బౌల్ క్లియర్ చేసుకోవడం వల్ల నిద్రలేమిని నివారించుకోవచ్చు. త్వరగా ఆకలేసేలా చేస్తుంది. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. పెద్ద పేగును శుభ్రం చేస్తుంది. పరగడుపున నీరు త్రాగడం వల్ల, రెడ్ బ్లడ్ సెల్స్ వేగంగా ఉత్పత్తి అవుతాయి. ఇది ఎక్కువ ఆక్సిజన్‌ను బ్లడ్‌తో పాటు శరీరంలో మిగిలినభాగాలకు చేరేందుకు సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.