శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (17:20 IST)

ఏసీ రూముల్లో కూర్చునే వారికే నిద్రలేమి సమస్య? 2 స్ట్రాబెర్రీ పండ్లను..?

పగలంతా శారీరకంగా శ్రమించే కార్మికులకు రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. అయితే ఏసీ రూముల్లో కూర్చుని హాయిగా పనిచేసే వారికి మాత్రం రాత్రిపూట నిద్రంటూపట్టదు. ఒక్క చుక్క కూడా చెమటపట్టకుండా.. శారీరక శ్రమ లేకుండా వుండేవారికి నిద్రలేమి సమస్య వేధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు ఈ ఐదు చిట్కాలు పాటిస్తే తప్పకుండా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రెండు చెర్రీ పండ్లు తీసుకుంటే.. హాయిగా నిద్రపడుతుంది.  
 
అలాగే పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభించే అరటి పండు రాత్రిపూట హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇక డిన్నర్లో టోస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. పిండిపదార్థాల్లో ఉంటే ఇన్సులిన్ హార్మోన్ నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. తద్వారా డిన్నర్లో తప్పకుండా టోస్టులు ఉండేలా చూడాలి. 
 
ఓట్స్‌ మీల్ ఒక కప్పు రాత్రిపూట తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. అలాగే ఓట్స్ శరీరంలోని ఇన్సులిని హార్మోన్లను నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఇకపోతే నిద్రించేందుకు ముందు అరటి పండుతో పాటు గోరువెచ్చని పాలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.