శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (17:15 IST)

రక్తపోటుకు చెక్ పెట్టాలంటే.. బరువు తగ్గాల్సిందే!

రక్తపోటు చెక్ పెట్టాలంటే.. బరువు తగ్గాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు పెరగడాన్ని నియంత్రించకపోవడంతో అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే బరువు తగ్గడం ప్రారంభిస్తారో.. అప్పుడే ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి చేరుకుంటారు. కాబట్టి, బరువు తగ్గడానికి ప్రారంభించండి. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే రక్తపోటును దూరం చేసుకోవాలంటే రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. ఆధునిక పోకడలతో ఎప్పుడూ.. లాప్ టాప్, కంప్యూటర్స్ ముందుకూర్చొవడం, లేదా ఫోన్లు, ఫేస్ బుక్, ట్విట్టర్లతో కాలక్షేపం చేస్తూ మరింత బద్దకస్తులుగా తయారవుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
 
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా జీవించగలరు. వారంలో కనీసం 5రోజుల వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచేందుకు వీలుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.