శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 జనవరి 2015 (14:30 IST)

ఒబిసిటీకి చెక్ పెట్టాలా? అయితే బ్లూబెర్రీస్ తీసుకోండి.

ఒబిసిటీని దూరం చేసుకోవాలా? అయితే బ్లూబెర్రీస్ తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎరుపు నీల వర్ణంలో ఉన్న ఈ పండులో అనామ్లజనకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. బ్లూ బెర్రీలు రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్‌ వ్యాధి దూరమవుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 
అలాగే బ్రొకోలీలో విటమిన్ K, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ అవసరమైన రెండు పోషకాలు ఎముకలు దంతాల బలోపేతం చేయడానికి సహాయం చేస్తాయి. అంతేకాక వివిధ రకాల క్యాన్సర్లను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇంకా స్థూలకాయాన్ని దూరం చేస్తాయి.