శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మార్చి 2015 (17:41 IST)

వంకాయ తినండి.. బరువు తగ్గండి..!

వంకాయ తినండి.. బరువు తగ్గండి..! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వంకాయ కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. శరీరంలో గల చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వంద గ్రాముల వంకాయలో 24 కెలోరీలు మాత్రమే ఉండటంతో బరువు పెరగకుండా ఉంటుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. వంకాయలోని ఆంటో సయనిన్ అనే పదార్థం నీరసాన్ని దూరం చేసి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇది క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. 
 
వంకాయలోని నీరు, పొటాషియం రక్తంలో చేరే కొవ్వును తగ్గిస్తుంది. వంకాయలోని పీచు పదార్థం ఆకలిని నియంత్రించి.. శరీర బరువును పెరగకుండా చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. వంకాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించుకోవచ్చు. ఇంకా వంకాయలోని నికోటిన్ అనే పదార్థం ధూమపాన అలవాటును మాన్పింప చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.