శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (19:33 IST)

అన్ని విధాలా ఆరోగ్యదాయకం 'కాప్సికమ్'

మానవ శరీరానికి మేలు చేసేవి కూరగాయలు అనే విషయం అందరికీ తెలుసు. అందునో కాప్సికమ్ మరింత మేలు చేస్తుందనే విషయం కొంత మందికి మాత్రమే గుర్తిస్తారు. కాప్సికమ్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాప్సికమ్ తినడం వల్ల కలిగే కొన్ని లాభాలను తెలుసుకుందాం.
 
ఇది తినడం వల్ల మీ చర్మం ఎంతో తాజాగ, మొటిమలు లేకుండా, అందంగా ఉండడమే కాకుండా, దీనిలో ఉన్న “Vitamin A” మీ కళ్ళకు సం రక్షణగా ఉపయోగ పడుతుంది.
 
 
కాప్సికం తీసుకోవడం వల్ల మీ చర్మంలోని నొప్పిని మీ శరీర అంతర్భాగాలకు సోకకుండా, పుండ్లు పడకుండా ఎంతగానో రక్షిస్తుంది. నొప్పిని తగ్గించి మీకు మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.
 
అస్తవ్యస్తంగా ఉన్న జీర్ణక్రియను కాప్సికం సరి చేస్తుంది. జస్టేషనల్ సమస్యల (ఫ్లాటులెన్స్, స్టొమక్ అప్ సెట్)ను నివారిస్తుంది. ఇంకా డయేరియా అబ్డామినల్ క్రాంప్ ను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్‌ను నివారిస్తుంది.
 
ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను స్టడీగా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచదు.
 
క్యాప్సికమ్‌లో కేయాన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది పెయిన్ రిలీఫ్ గా కూడా పనిచేస్తుంది, ఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్స్ ను నివారిస్తుంది. దీంతో తయారుచేసిన క్రీమ్ లేదా ఆయిట్ మెంట్ ను పెయిన్ రిలీఫ్‌గా ఉపయోగిస్తున్నారు .
 
క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ “Capsaicins ”మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.
 
దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా, జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా, మీరు ఎక్కువ జుట్టు కలిగి ఉండడానికి ఎంతో సహాయ పడుతుంది.