శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (18:40 IST)

బరువు పెరగాలా.. సీతాఫలం జ్యూస్‌లో తేనె, పాలు వేసి..

ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో, అటువంటి వారు సీతాఫలం జ్యూస్‌లో తేనె, పాలు మిక్స్ చేసి రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇది క్యాలరీలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భస్రావాన్ని నివారిస్తుంది.
 
సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల ఆస్తమాను తగ్గిస్తుంది. సీతాఫలంలోని మెగ్నీషియం అధికంగా ఉంటుంది. తద్వారా గుండె వ్యాధులను నయం చేస్తుంది. సీతాఫలంలోని ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అనీమియాను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఓరల్ హెల్త్‌కు మంచిది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. జాయింట్ పెయిన్స్‌ను నివారిస్తుంది. మార్నింగ్ సిక్‌నెస్‌ను దూరం చేస్తుంది. స్కిన్ అలర్జీకి చెక్ పెడుతుంది. స్కిన్ క్యాన్సర్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.