శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (13:18 IST)

కుటుంబ సభ్యులందరూ ఒకే రకమైన బ్రష్ వాడుతున్నారా?

చాలామంది రాత్రిపూట టీవీలు వీక్షిస్తూనో, ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేస్తూనో చాక్లెట్లు తినేస్తుంటారు. ఎన్ని తిన్నామన్న లెక్క కూడా ఉండదు. ఆ తర్వాత అలాగే పడుకుంటారు. ఇలా చేస్తే పళ్లు పాడవుతాయి. తిన్న తర్వాత కనీసం ఒక గ్లాసు మంచి నీళ్లతో నోరు పుక్కిలించడం మరవొద్దు.
 
కాల్షియం కలిగిన పండ్లు ఆరోగ్యానికే కాదు. పళ్లకు కూడా బలవర్ధకమైన ఆహారం. తరచూ వాటిని తింటే.. పైపళ్లు, కిందిపళ్లు బలంగా తయారవుతాయి.
 
కొందరైతే నెలల తరబడి టూత్‌బ్రష్‌ను మార్చరు. కనీసం రెండు మాసాలకు ఒక్కసారైనా బ్రష్‌ను మారిస్తేనే ఉత్తమం. మీ పళ్లకు సరిపడే బ్రష్‌ను కొనుగోలు చేయండి. కుటుంబ సభ్యులందరు ఒక రకమైన బ్రష్‌లు కాకుండా.. ఎవరికి ఏది సరిపడుతుందో దాన్నే తీసుకోండి. కొన్ని బ్రష్‌లు సాఫ్ట్‌గా, మరికొన్ని హార్డ్‌గా ఉంటాయి.