శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (16:56 IST)

ఆరోగ్యంగా ఉండాలంటే పీచు సమతులంగా తీసుకోండి!

పీచు ఆరోగ్యానికి చాలా అవసరం. పీచు శాకాహారంలోనే ఉంటుంది. పీచుపదార్థాలు తీసుకున్న ప్రతీసారీ తగినంత నీరు కూడా సేవించాలి. పిల్లలకు కూడా పీచు అవసరమేగానీ మరీ పీచుపదార్ధాలే ఎక్కువగా పెడితే.. త్వరగా కడుపునిండినట్త్లె ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దాంతోశక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్ధాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూడాలి. 
 
వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుందిగానీ. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి సమతులంగా పీచు అందాలంటే కార్న్, వైట్ బీన్స్, ఓట్స్, బ్లాక్ బీన్స్, శనగలు, అవెకాడో పండు, వీట్ బ్రెడ్ తీసుకోవాలి. వీటితో పాటు బ్రొకోలీ, బ్రౌన్ రైస్, బార్లీ, బాదం, ఆపిల్ పండ్లలో పీచు అధికంగా ఉంటుందని న్యూట్రీషన్లు అంటున్నారు.